కౌరవ సభ పోవాలి… గౌరవ సభ రావాలి
– మహానాడులో చంద్రబాబు పిలుపు
*పసుపువర్ణమైన రాజమహేంద్రవరం
*ఉభయ తెలుగురాష్టాల చూపు రాజమండ్రి వైపు
*రేపు పార్టీ మేనుపెస్టో ప్రకటన?
*రేపు పొత్తులపై కీలక ప్రకటన?
*పార్టీ శ్రేణులలో ఉప్పొంగిన ఉత్సాహం..
*గోదావరి రుచులతో భోజనాలు
తూర్పుగోదావరి
జిల్లా..
రాజమహేంద్రవరం(చల్లా శ్రీనివాస్.. నిజం రిపోర్టర్ )
మే 27..నిజం న్యూస్..
రాజమహేంద్రవరం వేదికగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమం అట్టహాసంగా శనివారం ప్రారంభమైంది
రాజమండ్రి శివారు వేమగిరి వద్ద ఏర్పాటు చేసిన సభాప్రాంగణానికి ఎన్టీఆర్ ప్రాంగణంగా పేరు పెట్టారు.రెండు రోజుల పాటు జరిగే ఈ మహానాడులో ఈసారి ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు ప్రత్యేక విశిష్టత అని పార్టీ వర్గాలు పేర్కొంటున్నారు.
మొదటి రోజు ఉభయ తెలుగు రాష్టాల నుండి సుమారు 15 వేల మంది ప్రతినిధులు హాజరైనారు.ఈ సందర్బంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు,మాజీ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.
అనంతరం తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరించారు.అనంతరం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో కౌరవ సభ పోయి గౌరవ సభ రావాలని, ప్రజలందరూ విజ్ఞతతో వ్యవహరించిన వైసిపి పార్టీ పాలనకు చరమగీతం పాడాలని పిలుపు నిచ్చారు.
ఈ రోజు దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అత్యంత పేద రాష్ట్రం కాగా, జగన్ మాత్రం అత్యంత సంపన్నుడు అయిన ముఖ్యమంత్రి అని ఎద్దేవా చేసారు.అలాగే 2000 నోట్లు పెద్ద మొత్తంలో జగన్ తన అధీనంలో ఉంచుకునే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేసారు.
Also read: అందరి జాతకాలు బయటకు తీస్తాం
తాము డిజిటల్ కరెన్సీని ప్రోత్సహించామని గుర్తు చేసారు.తెలుగుపార్టీ గుర్తు అయిన సైకిల్ కి అభివృద్ధి, సంక్షేమం రెండు చక్రాలు అని ఉద్గాటించారు.
ఈ రోజు ప్రపంచంలో రాజధాని లేని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని ఆవేదన వ్యక్తం చేసారు.అధికారం కోసం ముద్దులు పెట్టారని, తండ్రి లేని బిడ్డనని సెంటిమెంట్ తీసుకుని వచ్చారని,అధికారం కోసం కోడికత్తి డ్రామాలు ఆడారని ముఖ్యమంత్రి జగన్ ని ఉద్దేశించి విమర్శలు గుప్పించారు.
అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని సర్వనాశనం చేసారని మండిపడ్డారు.తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ బడుగు బలహీన వర్గాలకు గొప్ప ఉన్నత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. సంపదను సృష్టించి పేదవారిని ధనికులుగా చేయడమే తన లక్ష్యం అని పేర్కొన్నారు.ప్రైవేట్ పబ్లిక్ పార్టనర్ షిప్ తో అభివృద్ధికి ప్రణాళిక రచించాలని అన్నారు.
తమ పార్టీ కార్యకర్తలే తనకు స్ఫూర్తి అని, పార్టీ జెండా చూస్తే ఎక్కడలేని ఉత్సాహం వస్తుందని అన్నారు.త్వరలోనే తాను కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలతో మమేకం అవుతానని పేర్కొన్నారు. అన్న ఎన్టీఆర్ ఆశయాలకు నిరంతరం పాటుపడటమే తెలుగుదేశం పార్టీ లక్ష్యం అని అన్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ఉభయ రాష్టాల పార్టీ అధ్యక్షులు కింజరాపు అచ్చంనాయుడు,కాసాని జ్ఞానేశ్వర్,స్థానిక శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి,ఆదిరెడ్డి భవాని,పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చిన రాజప్ప,ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పార్టీ నాయకులు జ్యోతుల నెహ్రు, నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి తదితరప్రముఖులు అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.