అందరి జాతకాలు బయటకు తీస్తాం
గిరిజన ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి అవమానపరిచిన పోలీసు అధికారులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి
కబ్జాదారులకు సహకరిస్తున్న రెవిన్యూ అధికారులు మరియు పోలీస్ అధికారులు
మహబూబాబాద్ గిరిజన జిల్లా నుండి ప్రభుత్వ పతనం ప్రారంభం
వార్డు మెంబర్, వార్డు కౌన్సిలర్ నుండి మొదలై ఎమ్మెల్యే , ఎంపీ , మంత్రులు వరకు కబ్జాలను పాల్పడుతున్నారు
అందరి జాతకాలు బయటకు తీస్తాం
అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం
భూక్య జగన్ నాయక్ రాష్ట్ర కార్యదర్శి
లంబాడి హక్కుల పోరాట సమితి తెలంగాణ
ఈరోజు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పక్కన సర్వేనెంబర్ 551 బై వన్ ప్రభుత్వ భూమిలో లో అత్యధిక గిరిజన జనాభా కలిగిన మహబూబాబాద్ జిల్లాలో గిరిజన ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ నగర్ పేరుమీద ఒక కాలనీ ఏర్పాటు చేసుకోవడం కొరకు గిరిజనులు అందరు కలిసి గుడిసెలు వేసుకోవడం జరిగింది
అట్టి భూమిని కొంతమంది భూ కబ్జాదారులు తన అంగ బలం అర్థబలం మరియు రాజకీయ బలముతో ప్రభుత్వ స్థలంలో గతంలో ఆ ప్రభుత్వ స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేసుకోవడం జరిగింది అప్పుడు ఇదే రెవెన్యూ అధికారులు మరియు పోలీసు అధికారులు వారి దగ్గర ప్రదోభాలకు గురై చూసి చూడకుండా అట్టి ప్రభుత్వ స్థలాన్ని భూకబ్జాదారులకు ధార దత్తంగా వదిలి వేయడం జరిగింది.
Also read: 13 సంవత్సరాలు గడుస్తున్నా గేట్ల నిర్మాణం పూర్తి కాలే
కానీ అదే ప్రభుత్వ భూమిలో నిరుపేద గిరిజన ప్రజలు నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం 80 గజాల కోసం గుడిసెలు వేసుకుని నివసించడానికి ప్రయత్నిస్తే అదే గిరిజన ప్రజలపై రెవెన్యూ మరియు పోలీసు అధికారులు జులం ప్రదర్శిస్తున్నారు అదే బడా బాబులు రాజకీయ నాయకులు వార్డు మెంబర్ వార్డు కౌన్సిలర్ నుండి మొదలుపెడితే ఎంత పదవిలో ఉన్న రాజకీయ నాయకులు తమ బినామీల పేర్లతోటి వేల ఎకరాలు కబ్జాలు చేస్తుంటే ఇదే రెవెన్యూ వ్యవస్థ మరియు పోలీసు వ్యవస్థ వారి వద్ద మామూళ్లకు కక్కుర్తి పడి చూసి చూడకుండా వదిలేయడం జరుగుతుందిి
కానీ అదే పేద ప్రజలు ఉండడానికి 80 గజాల స్థలంలో గుడిసెలు వేసుకుంటే మాత్రం వారిపై జూదం ప్రదర్శించి అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపడం జరుగుతుంది రాబోయే రోజులలో ఈ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని మహబూబాబాద్ జిల్లా నుండి ప్రభుత్వ పతనం ప్రారంభం అవుతుందని హెచ్చరిస్తున్నాం .