13 సంవత్సరాలు గడుస్తున్నా గేట్ల నిర్మాణం పూర్తి కాలే
ఏళ్లు గడిచినా అదనపు గేట్ల నిర్మాణం పూర్తికాని వైనం
*2010లో ప్రారంభమైన నిర్మాణ పనులు
*13 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఆయకట్టు రైతులు
*ఆధునీకరణ పనులకు ఇప్పటికే రూ 65 కోట్లు ఖర్చు
చర్ల మే 27 (నిజం న్యూస్) మండలంలోని పెద మిడిసిలేరు మధ్యతరహా ప్రాజెక్టు అదనపు గేట్ల నిర్మాణం ఏళ్లు గడిచిన ఇప్పటివరకు పూర్తి కాలేదు 2010 సంవత్సరంలో అదనపు గేట్ల నిర్మాణం పనులు చేపట్టారు 13 సంవత్సరాలు గడుస్తున్న నిర్మాణం పనులు పూర్తికాక అసంతృప్తితో మిగిలిపోయాయి అదనపు గేట్లు నిర్మిస్తే మరింత ఉపయోగకరంగా ఉంటుందని ఊహించిన రైతుల కల గానే మిగిలిపోయింది
దీనికోసం 65 కోట్లు ఖర్చు చేసి పనులు చేపట్టడం జరిగింది ప్రాజెక్టు అధికారులు మరికొన్ని నిధులు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన ఫలితం లేదు రెండు సంవత్సరాల పూర్తి కావలసిన అదనపు గేట్ల నిర్మాణం 13 సంవత్సరాలు గడుస్తున్నా పూర్తికాక పోవడంతో ఎందుకు పూర్తి కావడం లేదని ఆయకట్టు రైతులు ప్రశ్నిస్తున్నారు
65 కోట్ల నిధులతో ఏం పనులు పూర్తిచేసినట్లు? ఈ నిర్లక్ష్యానికి బాధ్యులు ఎవరు అధికారులా? కాంట్రాక్టర్ పట్టింపులేని తనమా? అసలు అదనపు గేట్లు నిర్మాణం పూర్తి గా చేపడతారా లేదా అలాగే వదిలేస్తారా? రైతుల మదిలో మెదిలే ఈ ప్రశ్నలకు సమాధానం ఇచ్చే ది ఎవరు! గేట్ల నిర్మాణంపై. నిజం ప్రత్యేక కథనం
మండల పరిధిలోని దాని పేరు ప్రాజెక్టు భవిష్యత్తు ప్రార్ధకంగా మారింది ప్రాజెక్టు ఆధునికరణ పనుల పేరుతో అన్నదాతలకు మరింత ఉపయోగపడేలా తీర్చిదిద్దాలని అప్పటిఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావించింది ప్రాజెక్టు ఆధునికరణ పనుల కోసం జపాన్ నిదులనుంచి రూ 45 కోట్లు మంజూరు చేసింది
Also read: ఒక్కొక్క సంచి నుండి 6-7 కేజీల తరుగు తీస్తున్నరు
ప్రాజెక్టు అదిరేకరణ పనుల్లో భాగంగా ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టు బలోపేతం చేసే ఆలోచనతో అదనంగా మరో మూడు గేట్ల విమానం చేపట్టాలని నిర్ణయించారు 2010 జనవరిలో జపాన్ నిధులతో మొదలైన ఆధునీకరణ పనుల్లో కొన్ని పనులు పూర్తి చేసినప్పటికీ అర్ధాంతరంగా వదిలేశారు గోడల వరకు నిర్మాణం పూర్తి చేసి 13 సంవత్సరాలు ఉన్న పనులు మాత్రం ముందుకు పోవడం లేదు
మూడు గేట్ల నిర్మాణం పనులు పూర్తి చేస్తే తమకు మరింత ఉపయోగకరంగా ఉంటుందని భావించిన అన్నదాతలకు నిరాశ మిగిలింది ఇప్పటికే 65 కోట్లు ఖర్చు చేసినప్పటికీ నిర్మాణ పనుల్లో ఎటువంటి పురోగతి కనిపించడం లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కాంట్రాక్టర్ నిర్లక్ష్యం అధికారుల పట్టింపు లేని తనమే ఈ ఫలితాలకు కారణమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి
రెండేళ్లలో పూర్తికావలసిన నిర్మాణం పనులు 13 సంవత్సరాలు గడుస్తున్నా పూర్తి కాలేదు నిధులు సరిపడక మరింత నిధులు అవసరమని దానికోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు అధికారులు చెప్పుకొచ్చారు ఇప్పటికే కోట్లాది రూపాయలు ఖర్చు చేసినప్పటికీ అదనపు గేట్ల నిర్మాణం పనులు మాత్రం ఒకదారికి తీసుకురాలేకపోయారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి
*ఆయకట్టు రైతుల ఎదురుచూపులు ఫలించేది ఎప్పుడు?… అధర్మ గేట్లు నిర్మాణం పూర్తయితే తమకు మరింత ఆసరాగా ఉంటుందని భావించిన ఆయకట్టు అతలకు నిరాశ దూరవుతోంది దాదాపు 13 సంవత్సరాలు గా ఎదురుచూస్తూ ఉన్నప్పటికీ వారి ఎదురు చూపులకు ఫలితం దక్కడం లేదు ప్రతి ఏడాది ప్రతి ఏడాది తాళి పేరు ప్రాజెక్టు ఆధారం చేసుకుని 24. 700 లా ఎకరాలు అన్నదాతలు సాగు చేస్తున్నారు నిర్మాణం పూర్తి అయితే పంట సాగు మరింత పెరిగే అవకాశం లేకపోలేదు
ప్రస్తుతం 74 మీటర్ల సామర్థ్యం కలిగిన తాలి పేరు ప్రాజెక్ట్ వర్షాకాలంలో చతీష్ గడ్ అడవుల్లో నుంచి వాగులు, వంకలు పొంగి భారీ స్థాయిలో ప్రాజెక్టు కు నీరు చేరుకుంటుంది కరువు కాలంలో సైతం ప్రాజెక్టు నిండుకుండలా ఉండి రెండు పంటలకు నీరు అందించిన సందర్భాలు లేకపోలేదు
ప్రస్తుతం ఉన్న 25 గేట్లకు మరో మూడు గేట్లు తోడైతే తమకు మరింత ఉపయోగకరంగా ఉంటుందని అన్నదాతలు చెబుతున్నారు అధికారులు ఇప్పటికైనా స్పందించి ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి అదనపు గేట్ల నిర్మాణం పూర్తిచేసేలా సర్వ తీసుకోవాలని ఆయకట్టు అన్నదాతలు వేడుకుంటున్నారు