ఒక్కొక్క సంచి నుండి 6-7 కేజీల తరుగు తీస్తున్నరు

రైతుల బాధలను పట్టించుకునే నాథుడే లేడు!!
మాడ్గుల మే 26( నిజం న్యూస్ ): మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల ఆవరణలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీసీఐ వడ్ల కొనుగోలు కేంద్రంలో సంబంధిత అధికారుల నిర్లక్ష్యంతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని రైతులు ఆరోపించారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతులు నష్టపోవద్దనే ఉద్దేశంతో వడ్ల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తే సంబంధిత అధికారుల నిర్లక్ష్యంతో సౌకర్యాలు లేక నానా అవస్థలు పడుతున్నామని రైతు ఇర్విన్ గ్రామానికి చెందిన సూదిని వెంకటరెడ్డి ఆరోపించారు.
రైతులు తెలిపిన వివరాల మేరకు కొనుగోలు కేంద్రంలో హమాలీ కూలీలు లేక రైతులే స్వయంగా తూకం వేసి సంచులు నింపుతున్నామని, రైతులకు టోకెన్ నెంబర్ ఇవ్వకుండా అధికారులకు అనుకూలమైన రైతులకు ఒకే రోజులో కొనుగోలు చేసి పంపుతున్నారని, అమాయక రైతులను 20 రోజుల నుంచి అవస్థలకు గురి చేస్తున్నారని కొంతమంది రైతులు ఆరోపిస్తున్నారు.
ALSO READ: ఆలయ హుండీ లెక్కింపు
కొనుగోలు కేంద్రంలో తూకం వేసి నిబంధనల ప్రకారం కొలుకులపల్లి లోని సాయి రాఘవేంద్ర బాయిల్డ్ రైస్ మిల్లుకు చేరిన తర్వాత మిల్లు యాజమాన్యం ఒక్కొక్క సంచి నుండి 6-7 కేజీల తరుగు తీస్తున్నట్టు మిల్లు యాజమాన్యంపై రైతులు విమర్శలు గుప్పిస్తున్నారు, అధికారులు తక్షణమే స్పందించి మిల్లు యజమాన్యంపై చర్య తీసుకోవాలని రైతులు అధికారులను డిమాండ్ చేస్తున్నారు.
కొనుగోలు కేంద్రంలో సరిపడ హమాలి కూలీలను ఏర్పాటు చేయాలని అధికారులను డిమాండ్ చేస్తున్నారు. సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినప్పటి నుండి ఇప్పటివరకు కేంద్రాన్ని తనిఖీ చేసిన దాఖలాలు లేవని రైతులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించని యేడల కొనుగోలు కేంద్రం వద్ద ధర్నా చేస్తామని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
సిఇఓ ముత్యపు రెడ్డి ….. నిబంధనల మేరకే కొనుగోలు చేస్తున్నం.
మిల్లుకు చేరిన తర్వాత ఒక సంచికి6-7 కేజీలు తీస్తున్న మాట వాస్తవమే ఉన్నత అధికారులకు తెలియజేస్తా. రైతుల అభిప్రాయం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వడ్ల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసి మధ్య దళారులతో మోసపోకుండా గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకుంటుంటే సంబంధిత అధికారుల నిర్లక్ష్యంతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారులు స్పందించి తక్షణం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
రైతు కసిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇర్విన్ …కొనుగోలు కేంద్రంలో హమాలి కూలీలు లేక మా కుటుంబ సభ్యులతో మేమే సంచులు నింపుతున్నాము మేము కష్టపడ్డా కానీ హమాలి కూలీలకే డబ్బులు చెల్లిస్తాం అని అధికారులు చెబుతున్నారు.