ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు

ఫ్రాథమిక పాఠశాలను ప్రారంభించిన మంత్రి సత్యవతి రాథోడ్
మంగపేట, నిజం న్యూస్,మే26:- పది రోజుల్లో పాఠశాల ప్రారంభం కానున్న నేపథ్యంలో మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా పునర్నిర్మాణం పూర్తయిన పాఠశాలను ప్రారంభించుకున్నామని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
ALSO READ: పనిచేసే చోటనే వేతనాలు
శుక్రవారం మంగపేట మండలంలోని బాలన్నగూడెం గ్రామంలో మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా పూర్తయిన ప్రాథమిక పాఠశాల భవనాన్ని రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ జిల్లా చైర్మన్ కుసుమ జగదీష్, రాష్ట్ర ట్రైకర్ చైర్మన్ రామచంద్రనాయక్, జిసిసి చైర్మన్ వాలియా నాయక్, ఐటీడీఏ పీవో అంకిత్, అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి, జెడ్పి వైస్ చైర్మన్ బడే నాగజ్యోతిలతో కలిసి వేదమంత్రోచరణల మధ్య ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 7 వేల రెండు వందల కోట్లతో మన ఊరు మనబడి పాఠశాలల పునర్నిర్మాణం చేపట్టామన్నారు. పది రోజుల్లో పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా పూర్తయిన పాఠశాలలను ప్రారంభించుకుంటున్నామని అన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాల పునర్నిర్మాణం చేపట్టారని తెలిపారు. జిల్లాలో పోడు పట్టాలు 24 నుండి పంపిణీ కార్యక్రమం చేపడతామని ముఖ్యమంత్రి తెలిపారని
ఆమె వివరించారు.
అనంతరం మంగపేట మండల కేంద్రం 16 లక్షల ఐటిడిఏ నిధులతో నూతనంగా నిర్మించిన రెవెన్యూ అతిథి గృహంను మంత్రి ప్రారంభించినారు. అనంతరం మంగపేట మండలంలోని గంపోనిగుడెంలో నూతనంగా నిర్మాణం చేసిన గిరిజన ఫీలింగ్ స్టేషన్ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ చైర్మన్ గోవింద నాయక్, డిఆర్ఓకే రమాదేవి, ట్రైబల్ వెల్ఫేర్ ఈ ఈ హేమలత, మండల ప్రత్యేక అధికారి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ తులా రవి, డి. డ బ్లు ఓ ప్రేమలత, మంగపేట తహసిల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీవో శ్రీనివాస్, ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాద్యాయులు, విద్యార్ధులు, సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.