Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ప్రతీ పల్లెటూరులో పల్లె దవఖానలు

మట్టంపల్లి ఆత్మీయ సమావేశం లో పాల్గొన్న మంత్రులు.

మట్టంపల్లి మే 26 (నిజం న్యూస్) శుక్రవారం మట్టంపల్లి మండల కేంద్రం లో ఆత్మీయ సమావేశం లో పాల్గొని దిశా నేర్దేశం చేసిన మంత్రులు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి.

ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు మాట్లాడుతూ ప్రతి ఒక్క పల్లెటూరులో పల్లె దవఖానలు, దేవాలయం అభివృద్ధి, స్కూల్స్ డెవలప్మెంట్, రైతు వేదికలు నిర్మించడం, రైతు బందు, రైతు భీమా, షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి, మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో ఏళ్ల కల అని తెలిపారు.

ALSO READ: మహిళల కోసం ప్రత్యేక డిపాజిట్ పధకం… మహిళా సమ్మాన్ సేవింగ్

రాష్ట్రంలో పల్లెల అభివృద్ధి చెందుతుందని పట్టణాలు జిల్లాలు రాష్ట్రం అభివృద్ధి చెందినట్లు అని ముఖ్యమంత్రి ఆలోచన అని అన్నారు. ఆ ఆలోచనతోనే ముందుకు సాగుతూ పల్లెల్లో అభివృద్ధిని పరుగులు పట్టిస్తున్నామని హుజూర్నగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని గత మూడు సంవత్సరాల్లో 20 ఏళ్లలో లేని అభివృద్ధి కార్యక్రమాలు మీ కళ్ళముందే జరుగుతున్నాయని తెలిపారు.

ఈసారి ఎన్నికల్లో కూడా సైదిరెడ్డిని అధిగ మెజార్టీతో గెలిపించే బాధ్యత మీ మీద ఉందని తెలిపారు.

ఈ కార్యక్రమం లో ఎంపీ బడుగు లింగయ్య యాదవ్,కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు, సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్, మాజీ మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్, నేరేడుచర్ల వైస్ చైర్మన్ చల్ల శ్రీలత రెడ్డి, హుజుర్నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటరెడ్డి,మట్టంపల్లి సర్పంచ్ మన్నెం శ్రీనివాస్ రెడ్డి ఎంపీపీ పార్వతి కొండా నాయక్ , గుండా బ్రహ్మ రెడ్డి, ఇరుగు పిచ్చయ్య,మండల అధికారులు సర్పంచులు ఎంపీటీసీలు పార్టీ ముఖ్య నాయకులు సోషల్ మీడియా అధ్యక్షులు, నియోజకవర్గం ప్రజలు పలువురు పాల్గొన్నారు.