మహిళల కోసం ప్రత్యేక డిపాజిట్ పధకం… మహిళా సమ్మాన్ సేవింగ్

,పోస్టాఫీసు నందు మహిళల కోసం ప్రత్యేక డిపాజిట్ పధకం మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్
– పోస్టల్ సూపరింటెండెంట్ వడ్లమూడి వెంకటేశ్వర్లు
పెన్ పహాడ్ ప్రతినిధి మే 26 నిజం న్యూస్
తపాల శాఖలో మహిళలు మరియు బాలికల కోసం మహిళా సమ్మాన్ సేవింగ్ పధకంలో 2,00,000/- పెట్టుబడి పెట్టడం ద్వారా రెండు సంవత్సరాల తరువాత 7.5% వడ్డితో 2,32, 044/- పొందవచ్చని సూర్యాపేట పోస్టల్ సూపరింటెండెంట్ వడ్లమూడి వెంకటేశ్వర్లు అన్నారు.
శుక్రవారం నాడు నిజం న్యూస్ ప్రతినిధి తో మాట్లాడుతూ సూర్యాపేట పోస్టల్ డివిజన్ పరిధిలోని హుజూర్ నగర్, కోదాడ, మిర్యాలగూడ, నకిరేకల్ పోస్టాఫీసులలో మరియు వాటి పరిధిలోని గ్రామాలలోని పోస్టాఫీసు ల నందు బాలికలు, మహిళల పేరుమీద మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ ఖాతాలలో పెట్టుబడి పెట్టి అత్యధిక వడ్డీ పొందాలని ఆయన చెప్పారు.
ALSO READ: ఖాళీ నోట్ల పై సంతకాలు… బాకీ తీరినా ఆగని బెదిరింపులు
ఈ పధకం ఏప్రిల్1, 2023 నుండి అమలులోకి వచ్చిందని, 1000/- నుండి 2,00,000/- వరకు డిపాజిట్ చేయవచ్చని ఆయన చెప్పారు. కాబట్టి ప్రజలు ఈ పధకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు.
సూర్యాపేట ప్రధాన తపాల కార్యాలయం నందు ఆధార్ నమోదు కేంద్రాన్ని శుక్రవారం నాడు సూర్యాపేట పోస్టల్ సూపరింటెండెంట్ వడ్లమూడి వెంకటేశ్వర్లు పునః ప్రారంభించా మన్నారు
గతంలో కొన్ని కారణాల వలన పోస్టాఫీసులలో ఆధార్ కేంద్రాల సేవలు నిలిచిపోయాయని, తిరిగి ఆధార్ నమోదు కేంద్రాలను పునరుద్ధరణ చేస్తున్నట్లు చెప్పారు.
త్వరలోనే కోదాడ, హుజూర్ నగర్, మిర్యాలగూడ, నకిరేకల్ లలో కూడ ఆధార్ సేవా కేంద్రాలను ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట ప్రధాన తపాల కార్యాలయం పోస్ట్ మాస్టర్ యాదగిరి, సిబ్బంది పాల్గొన్నారు.