ఖాళీ నోట్ల పై సంతకాలు… బాకీ తీరినా ఆగని బెదిరింపులు

* ఫైనాన్స్ వ్యాపారుల ఆగడాలు..
బయోందోళనలకు గురవుతున్న బాధితులు.
నిజం న్యూస్ ఏ. పీ స్టేట్ బ్యూరో
అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లా లో వడ్డీ వ్యాపారుల ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు తీసుకుంటున్న సమయంలో ఖాళీ నోట్లపై సంతకాలు వేలిముద్రలు తీసుకొని అప్పులు ఇస్తున్నారు. మళ్లీ తిరిగి అధిక శాతం వడ్డీతో ఆ అప్పులు ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నారు.
అయితే తీసుకున్న అప్పులు పూర్తిగా తీర్చినా వడ్డీ వ్యాపారులు మాత్రం ఇంకా బాకీ ఉన్నారని, మెత్తం తీర్చె వరకు ఖాళీ నోట్లు ఇచ్చేది లేదని తెగేసి చెబుతున్నారని పేరు చెప్పుకోలేని బాధితులు వాపోతున్నారు. ఇటీవల నర్సీపట్నం మండలం గబ్బాడ గ్రామంలో మెల్లేటి. నాగేశ్వరరావు అనే వ్యక్తికి నర్సీపట్నం కు చెందిన ఒక వడ్డీ వ్యాపారి ఖాళీ నోట్ ఖాళీ చెక్ తీసుకొని 50,000 రూపాయలు అప్పు ఇచ్చాడు.
Also read: సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అక్రమ వసూళ్ల దందా ..!
అయితే ఆరు రూపాయల వడ్డీ తో ఆ అప్పు తీర్చేచినా వడ్డీ వ్యాపారి మాత్రం ఇంకా తీర్చాలని బెదిరింపులకు దిగాడు. ఇంటికి సైతం వెళ్లి కుటుంబ సభ్యులను భయబ్రాంతులకు గురి చేయడంతో వారు 100 నెంబర్ కు ఫోన్ చేసి సమాచారం అందించారు.
వెంటనే స్పందించిన పోలీసులు వడ్డీ వ్వాపారిని అదుపులోకి తీసుకొని ఆయన నుంచి ఖాళీ నోట్ చెక్ ను బాదితునకు తిరిగి అందజేయించారు.
Also read: సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అక్రమ వసూళ్ల దందా ..!
అలాగే రావికమతం మండలం లో గిరిజనులకు నర్సీపట్నం ఏరియాకు సంబంధించి మరో వడ్డీ వ్యాపారి ఇదే తరహలో అప్పులు ఇచ్చి తిరిగి అధిక వడ్డీతో పూర్తిగా వసూలు చేసినా ఇంకా ఇవ్వాలంటూ బెదిరింపులకు దిగడంతో వారు కూడా కొత్తకోట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన పోలీసులు వడ్డీ వ్యాపారిని పిలిపించి బాధితులకు న్యాయం చేశారు.
ఇలాంటి సంఘటనలు ఈ ప్రాంతంలో కోకొల్లాలగా జరుగుతూనే ఉన్నాయి. వడ్డీ వ్యాపారులు ఇంటికొచ్చి ఎక్కడ పరువు తీస్తారేమోననే భయంతో వారికి అధికంగా డబ్బులు చెల్లిస్తూనే ఉన్నారు.
చట్టం ప్రకారం ఖాళీ నోట్లు వేలిముద్రలు తీసుకోకూడదు. అయినా వడ్డీ వ్యాపారులకు ఆ చట్టాలు వర్తించవా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి వడ్డీ వ్యాపారుల ఆగడాలను అరికట్టాలని పలువురు కోరుతున్నారు.