పేకలు పెట్టాకే పిట్ట ముట్టింది
పిట్ట ముట్టలేదని పేకముక్కలు పెట్టారు
జమ్మికుంట, మే 26 (నిజం న్యూస్)
జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ఆబాది జమ్మికుంటలో పిట్ట ముట్టడం లేదని పిండి పదార్థాలతో పాటు పేకముక్కలను పెట్టారు.
సోమవారము రోజున ఆబాది జమ్మికుంట గ్రామంలో వృధ్యాప్యంతో వెంకట్రాజం అనే వ్యక్తి మృతి చెందాడు. 3వ రోజు కార్యక్రమంలో పిట్ట ముట్టకపోవడంతో బంధువులు, కులస్తులు, గ్రామస్తులు చింతిచారు.
Also read: ఆ బ్రాంచ్ పోస్టు మాస్టర్… వసూల్ రాజా ..?
5వ రోజు కార్యక్రమంలో స్థానికుల సలహా మేరకు ఆయనకు నచ్చిన వంటకాలతో పాటు ఆయన నిత్యం ఆడే పేక ముక్కలను కూడా ఓ విస్తరిలో ఉంచారు.
ఆయనకు నచ్చిన వస్తువులను కూడా అక్కడ ఉంచి పక్షి రాకకోసం ఎదురు చూస్తుండగా పిట్ట రావడం వంటకాలను తినడం జరిగిపోయాయి.
దీంతో అతని కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్థులు కూడా సంతోషం వ్యక్తం చేశారు.