ఆ బ్రాంచ్ పోస్టు మాస్టర్… వసూల్ రాజా ..?
ఆయనొక వసూల్ రాజా
బ్రాంచ్ పోస్టు మాస్టర్ ఇష్టారాజ్యం
ప్రతి పనికి ఒక రేట్
కరువు పని డబ్బులో కక్కుర్తి, పెన్షన్లో కట్టింగ్లు
పెన్ పహాడ్ మండలం
మండలంలోని ఒక బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ తీరు ఇష్టారాజ్యంగా మారింది. గతంలో ఒకసారి సస్పెండ్ అయినా ఆయన తీరులో మాత్రం ఏ మాత్రం మార్పు రాలేదు. ఏంటే, ఒసేయ్, ఒరేయ్ ఈ విధంగా పెన్షన్, కరువు పని డబ్బులకు వచ్చిన ప్రజలను పిలుస్తూ శాషిస్తున్నాడు. ఆయనకు నమస్తే పెట్టకపోతే వారం తిరిగిన డబ్బులు ఇయ్యడంట అంతే కాక ఇచ్చే డబ్బులో కటింగ్ లకు కూడా పాల్పడతాడని ప్రజలు ఆరోపిస్తున్నారు.
Also read: తెరలేని కొత్త టీవీ…. ఫ్రీస్టైల్
ఉదాహరణకు కరువు పని డబ్బు 570 రూ.లు పెడితే 70 కట్ చేసి 500 ఇస్తాడని ఇదేమిటని ప్రశ్నించినా సమాధానం ఉండదని ప్రజలు చెప్తున్నారు. 5 గ్రామ పంచాయితీలకు ఆయనే పోస్ట్ మాస్టర్ అవడంతో 5 గ్రామాల ప్రజలను దోచుకుంటున్నాడని వృద్దులకు, వితంతువులకు, వికలాంగులకు వచ్చే పెన్షన్ డబ్బులో కూడా కక్కుర్తి చూపిస్తూ పైన వచ్చే 16 రూ.లు ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు.
అంతేకాక కొత్త పెన్షన్ వచ్చిన వారి నుండి మనిషికి 200 కట్ చేసుకొని ఇచ్చాడని కొత్త పెన్షన్ దారులు తెలిపారు. ఇవి మాత్రమే కాక పండగ వస్తే మామూలు పేరు చెప్పి కటింగ్లు, నెట్ సరిగా రాట్లేదని మిషన్ కొనాలని కటింగ్లు చేస్తాడట.
ఇదేమిటని ప్రశ్నిస్తే డబ్బులు పడలేదని ఇంటి చుట్టూ తిప్పుతాడని, నాగులపాడు, నారాయణ గూడెం, అన్నారం బ్రిడ్జి, నాగులపాటి అన్నారం, పొట్లపాడు గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తంచేశారు.
నేటికి ఆయన పైన చరవాణి ద్వారా ఉన్నతాధికారులకు పిర్యాదులు అందుతునే ఉన్నాయి. ఇకనైన ఉన్నతాదికారులు ఫిర్యాదులకు స్పందించి విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాల్సి ఉంది.
కొత్త పెన్షన్లో 200 రూ.లు కట్ చేసిండు -నంద్యాల కమలమ్మ
నాకు ఈ మధ్యే ప్రభుత్వం పెట్టిన కొత్త పెన్షన్లో పేరు వచ్చింది. మొదటిసారి ఇచ్చేటప్పుడు 2000 ఇవ్వకుండా 1800 మాత్రమే ఇచ్చాడు. ఇదేమిటంటే మొదటిసారి అలాగే ఇస్తామని చెప్పాడని తెలిపింది.