మోటార్ వెహికిల్ దొంగలు అరెస్టు
సీఐ ముత్యం రమేష్…
ముగ్గురు వ్యక్తులు అరెస్టు…
సీఐ,ఎస్సై ను అభినందించిన మణుగూరు డీఎస్పీ రాఘవేందర్ రావు
మణుగూరు మే 26 (నిజం న్యూస్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలో జరుగుతున్న బైక్ దొంగతనాలకు మణుగూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ ముత్యం రమేష్ చెక్ పెట్టారు. ముగ్గురు నిందితులు అనుకున్నదే తడవుగా బైక్‌లు దొంగతనాలు చేస్తూ జల్సాలు చేసి,చివరకు సీఐ ముత్యం రమేష్ చేతిలో కటకటాల పాలయ్యారు.
ఈకేసుకు సంబంధించి గురువారం మణుగూరు సబ్ డివిజన్ కార్యాలయంలో డీఎస్పీ ఎస్.వీ రాఘవేందర్ రావు ఆధ్వర్యంలో సీఐ ముత్యం రమేష్ సమక్షంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు.
గురువారం ఉదయం 10గంటల ప్రాంతంలో సీఐ ముత్యం రమేష్,ఎస్సై బట్ట పురుషోత్తం హనుమాన్ టెంపుల్ వద్ద సిబ్బందితో వాహనాలు తనిఖీ చేస్తున్నామని సీఐ తెలిపారు. అయితే ఓ ముగ్గురు వ్యక్తులు ఓ పల్సర్ బైక్ పై అశ్వాపురం వైపు వెల్లుతుండగా వారిని ఆపి వాహనానికి సంబంధించిన పత్రాలు,వాహన డ్రైవర్ లైసెన్స్ ను చూపించమని అడిగామని చెప్పారు.
దీంతో ఆముగ్గురు వ్యక్తులు సమాధానం చెప్పకుండా వాహనానికి సంబంధించిన పత్రాలు,డ్రైవర్ లైసెన్స్ చూపించకుండా అక్కడి నుండి పారిపోవడానికి ప్రయత్నించారని ఆయన తెలిపారు.
ఈలోగా ఆముగ్గురు వ్యక్తులను పట్టుకొని విచారించగా గత కొంతకాలం నుండి మణుగూరులోని అశోక్ నగర్,సమితి సింగారం, పీవీ కాలనీ,రాజీవ్ గాంధీ నగర్,పూల మార్కెట్ ఏరియాలో బైక్ లు దొంగతనం చేసి వాటినన్నింటినీ పీవీ కాలనీ ఏరియాలోని వాటర్ ట్యాంక్ వద్ద అడివిలో దాచిపెట్టిరని తెలిపారు.
Also read: తిరుమలగిరిలో బంద్….. సంపూర్ణం
అందులో నుండి ఒక్క మోటార్ సైకిల్ ను తీసుకొని భద్రాచలంలో అమ్మి అట్టి డబ్బులు తీసుకొని వారి అవసరాలకు,జలసాలకు వాడుకొనుటకు వెల్లుతుండగా వారిని హనుమాన్ టెంపుల్ వద్ద అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు.వారి వద్ద నుండి 7 మోటార్ సైకిళ్లను రికవరీ చేయడం జరిగిందని సీఐ తెలిపారు.
మోటార్ సైకిళ్ల దొంగతనానికి పాల్పడిన వ్యక్తులు,మోటార్ సైకిళ్ల వివరాలు ఈవిధంగా ఉన్నాయని మీడియా సమావేశంలో తెలియజేశారు.1.ఎస్కె అక్బర్ తండ్రి అన్వార్,ఏరియా అశోక్ నగర్,2.తెడ్డు మహేష్,తండ్రి శ్రీశైలం ఏరియా అశోక్ నగర్,పీవీ కాలనీ,ఇంకొకరు మైనర్ బాలుడు అని తెలిపారు. దొంగిలించిన మోటార్ సైకిళ్ళ దొంగతనం చేశానని ఒప్పుకున్నాడు.అనంతరం తగు చర్య నిమిత్తం ఆవ్యక్తులకు కోర్ట్ కు తరలించడం జరిగిందని తెలియజేశారు.
ఈకేసును ఛేదించడంలో కీలకపాత్ర పోషించిన సర్కిల్ ఇన్స్పెక్టర్ ముత్యం రమేష్ ను,ఎస్సై బట్ట పురుషోత్తంను మణుగూరు సబ్ డివిజన్ డీఎస్పీ ఎస్.వీ రాఘవేందర్ రావు ప్రశంసించి అభినందించారు