తిరుమలగిరిలో బంద్….. సంపూర్ణం
ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాల్సిందే.
పోలీసుల అక్రమ అరెస్టులు దారుణం…
ప్రతిపక్ష నాయకులు ఆగ్రహం.
సూర్యాపేట ప్రతినిధి మే 26 నిజం న్యూస్
తిరుమలగిరి ఆత్మీయ సమ్మేళనంలో తుంగతుర్తి ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ ప్రతిపక్షాలపై అనుచిత వ్యాఖ్యలు నిరసిస్తూ అఖిలపక్ష నాయకులు శుక్రవారం రోజున స్వచ్ఛంద బందుకు పిలుపునివ్వగా యాజమాన్యం ఉదయం నుంచి స్వచ్ఛందంగా బంధు నిర్వహించారు.
పోలీసులు మాత్రం నియంత ధోరణితో ప్రతిపక్ష నాయకులను ఉదయం నుంచి నియోజకవర్గంలో వివిధ మండలాల పోలీస్ స్టేషన్లో అరెస్టు చేశారు.
Also read: కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభం… గుర్తుగా 75 రూపాయల నాణెం విడుదల
అక్రమ అరెస్టులు చేయడం దుర్మార్గమని, శాంతియుతంగా ధర్నా చేస్తుంటే అరెస్టులు ఎందుకని, ప్రతిపక్ష నాయకుల ప్రశ్నిస్తున్నారు..
ఎమ్మెల్యే బే షర్టుగా క్షమాపణ చెప్పేంతవరకు తమ పోరాటం ఆగదని, ఉద్యమిస్తామని హెచ్చరించారు…