తెరలేని కొత్త టీవీ…. ఫ్రీస్టైల్

నలభై ఏళ్ళకు పైగా మన ఇళ్ళలోని లివింగ్ రూమ్ నిండా ఆక్రమించుకుని తిష్ఠ వేసుకున్న టీవీ కి నూకలు చెల్లిపోయే రోజులు దగ్గర పడుతున్నాయి.
ఒకానొకప్పుడు మనబాల్యంలో హార్మోనియం పెట్టె లాంటి రేడియో మన ఇళ్ళల్లో ఉండేదని ఎలా గుర్తుచేసుకుంటున్నామో, ఇకనుంచీ పుట్టబోయే పిల్లలు క్లాస్ రూం బ్లాక్ బోర్డ్ లాంటి టీవీలు ప్రతిఇంటి హాల్లో ఉండేవని గత చరిత్రలో భాగంగా తెలుసుకుని పేలవంగా నవ్వుకుంటారు.
ALSO READ: అనువైన వాతావరణం వల్లే.. కొత్త పరిశ్రమల ఏర్పాటు
శామ్ సంగ్ కంపెనీ పరిచయం చేస్తున్న ” తెరలేని ” ఈ కొత్త టీవీ ఫ్రీస్టైల్ అనే పేరుతో అందరి ఇళ్ళలోకి చొచ్చుకు పోబోతోంది.
ఉప్పెన లాంటి మార్పు తీసుకొస్తున్న టెక్నాలజికల్ విప్లవం మానవాళిని ఉలిక్కిపడేలా చేస్తుంది.