చెక్ డ్యామ్ కు మరమ్మతులు చేపట్టాలి

మాడ్గుల మే 25 (నిజం న్యూస్):
మాడ్గుల మండలం ఆవురుపల్లి గ్రామ సమీపంలోని బంగారుగడ్డ వద్ద ప్రధాన రహదారి పక్కనే ఉన్న చెక్ డ్యాంమ్ గత కొన్ని సంవత్సరాల క్రితం వచ్చిన భారీ వర్షాలకు తెగిపోయి నీరు నిలువ ఉండక నిరుపయోగంగా మారిందని చుట్టుపక్కల రైతులు తెలిపారు.
ALSO READ: ముందుగానే నాట్లేసేకుని ముందస్తుగానే నూర్చుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలె
గతంలో ఈ చెక్ డ్యాంలో నీరు నిలువ ఉండడం వల్ల మూగజీవాల దాహార్తిని తీర్చేందుకు ఉపయోగపడడంతోపాటు భూగర్భ జలాలు పెరిగి చుట్టుపక్కన ఉన్న బోర్లలో విరివిగా నీరు ఉండేదని వారు పేర్కొన్నారు.
ఈ చెక్ డ్యాం తెగిపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని సంబంధిత అధికారులు , ప్రజా ప్రతినిధులు స్పందించి తెగిన చెక్ డ్యాంమ్ కు మరమ్మతులు చేసి ఆదుకోవాలని చుట్టుపక్కల ఉన్న రైతులు కోరుతున్నారు.