మా అసోసియేషన్ నుంచి కరాటే కళ్యాణి సస్పెండ్

మహబూబాబాద్ బ్యూరో మే 25 నిజం న్యూస్
టాలీవుడ్ నటి కరాటే కళ్యాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యం ఏదో ఒక వివాదంలో ఆమె పేరు నానుతూనే ఉంటుంది.
ఇక గత కొన్ని రోజులుగా ఆమె ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై పోరాడుతున్న విషయం తెల్సిందే నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని ఖమ్మంలో 54 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న విషయం తెల్సిందే..
Also read: వరకట్నం తీసుకుంటే డిగ్రీ పట్టా రద్దు..?
మే 28 న ఈ విగ్రహావిష్కరణ జరగనుంది. ఈ నేపథ్యంలోనే ఆమె ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టడానికి వీల్లేదని, ఎన్టీఆర్ దేవుడు కాదని సంచలన వ్యాఖ్యలు చేసింది.
కృష్ణుడు రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడంపై ఆమె పలు ఆరోపణలు చేసింది. ” ఎన్టీఆర్ ఎవరికి దేవుడు.. ఏ వర్గానికి దేవుడు.. ఎవరి కోసం ఆయన్ను దైవాన్ని చేస్తూన్నారు…ఎవరిని మెప్పించడానికి ఇదింతా చేస్తున్నారని ప్రశ్నించారు.
దైవానికి , మానవునికి తేడా ఉందా లేదా… మానవుడు దేవుడైతే.. ఇంకా మనం దేవుళ్లని పూజించడం ఎందుకని.. మన ఫొటోలను పెట్టుకుని మనకు మనమే పూజించుకోవచ్చు” అని చెప్పుకొచ్చింది.
ఆమెకు తోడుగా యాదవ సంఘాలు కూడా ఆ విగ్రహాన్ని కూల్చివేయాలని డిమాండ్ చేశారు..