Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

వరకట్నం తీసుకుంటే డిగ్రీ పట్టా రద్దు..?

తెలంగాణలో రాబోతున్న నూతన విధానం..?

మహబూబాబాద్ బ్యూరో మే 25 నిజం న్యూస్

ఆడపిల్లలను కన్నవారు అల్లుడికి వరకట్నం ఇవ్వడం ఎప్పటి నుంచో ఉన్న ఆచారంగా కొనసాగుతుంది. పెళ్లిలో కచ్చితంగా ఎంతో కొంత నగదును వధువు కుటుంబ సభ్యులు వరుడికి ఇస్తారు.

అయితే ఇటీవల హైకోర్టు విడాకుల విషయం సంచలన తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. కేరళ ప్రభుత్వం వరకట్నం తీసుకునేవారికి డిగ్రీ పట్టా రద్దు చేసే విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. తాజాగా, తెలంగాణలో కూడా ఈ విధానాన్ని తీసుకురాబోతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో సీనియర్ లెక్చరర్ శ్రీనివాస్ మాధవ్ కేరళ వరకట్న వ్యతిరేక విధానాన్ని అధ్యయనం చేశారు.

Also read: జీలుగ విత్తనాలతో …పంటలో పెరగనున్న దిగుబడి

రెండేళ్ల కిందటే కేరళలో వరకట్న వ్యతిరేక విధానం అమలులోకి వచ్చినప్పటి నుంచి విద్యార్థులు, తల్లిదండ్రుల వైఖరిలో మార్పు వచ్చింది. వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల్లో ఇదే విధానాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మహిళా కమిషన్‌కు ప్రతిపాదన సమర్పించారు. ప్రభుత్వం ప్రస్తుతం ప్రతిపాదనను అవసరమైన ప్రోటోకాల్‌లను పరిశీలిస్తోంది. ఈ విషయమై ఉన్నత విద్యామండలితో పాటు మహిళా శిశు సంక్షేమ శాఖతో సమావేశం నిర్వహించి అధికారికంగా ప్రకటించాలని కూడా అధికారులు ఆలోచిస్తున్నారు. అంతేకాకుండా కట్నం తీసుకుంటే డిగ్రీ పట్టా రద్దు చేసే విధానాన్ని అమల్లోకి తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది…