Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

జీలుగ విత్తనాలతో …పంటలో పెరగనున్న దిగుబడి

జమ్మికుంట, మే 24 (నిజం న్యూస్)

జీలుగ వి త్తనాలను విత్తి ఏపుగా పెరిగిన తర్వాత పంట పొలాల్లో కలియ దున్నడం వల్ల ఆ భూమిలో సారవంతం పెరిగి వచ్చే వర్షాకాలంలో పంట దిగుబడి పెరిగేందుకు ఎంతో దోహద పడు తోందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు.

హుజురాబాద్ మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద జీలుగ విత్తనాలను కౌశిక్ రెడ్డి పంపిణీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం సబ్సిడీపై విత్తనాలు అందజేస్తుందని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

జిల్లా వ్యాప్తంగా రైతులకు సబ్సిడీపై అందించేందుకు హుజురాబాద్ నియోజకవర్గం లో జీలుగ మొత్తం
2210 క్వింటాళ్లు, రూ.1,15,27,360 లు సబ్సిడీ జీలుగ విత్తనాలను ప్రభుత్వం వ్యవ సాయ శాఖ ఆధ్వర్యంలో అందించేందుకు సిద్ధ మైంది.

ALSO READ: నాణ్యమైన ధాన్యాన్నే కొనుగోలు చేస్తున్నాం

ఈ సందర్భంగా జిల్లాలోని అన్ని మం డలాల్లో ఈ జీలుగ విత్తనాలను అందుబాటు లో ఉంచింది.

30 కిలోల బస్తా సబ్సిడీ పోను రూ.843 చెల్లిస్తే రైతులకు అందిస్తారు.

విత్తనాలు కావల్సిన రైతులు ఆధార్‌ కార్డు, పట్టాదారు పాసు పుస్తకం జిరాక్స్‌తో సంబంధిత ఏఈవోల దగ్గర పర్మిట్‌ పొంది అగ్రో సేవా కేంద్రాల్లో విత్తనాలను పొందాల్సి ఉంటుంది.