నాణ్యమైన ధాన్యాన్నే కొనుగోలు చేస్తున్నాం

మహబూబాబాద్ బ్యూరో మే 24. నిజం న్యూస్
రైతుల నుండి నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ తరుగు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ శశాంక నివేదించారు.
బుధవారం ఐ డి ఓ సి లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ధాన్యం కొనుగోళ్ల తీరుతెన్నులపై రాష్ట్ర పౌర సరఫరాలు బీసీ సంక్షేమ శాఖ మాత్యులు గంగుల కమలాకర్ సివిల్ సప్లై స్ కార్పొరేషన్ చైర్మన్ రవీందర్ సింగ్ కమిషనర్ అనిల్ కుమార్ లతో కలిసి జిల్లా కలెక్టర్లతో సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మంత్రికి వివరిస్తూ జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల కేంద్రాలను సజావుగా నిర్వహిస్తున్నామని, నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు రైతులకు అవగాహన కల్పిస్తూ తరుగు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు.
ALSO READ: కొత్తూరు టిడ్కో ఇంట ఈగల మోత
జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు 234 కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించి ధాన్యాన్ని బట్టి 191 కేంద్రాలను ఏర్పాటు చేసి కొనుగోలు సజావుగా నిర్వహిస్తున్నామన్నారు .
ఇప్పటివరకు జిల్లాలోని కొనుగోలు కేంద్రాల ద్వారా 80 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందని 62వేల మెట్రిక్ టన్నుల ధాన్యం తరలించగా 15 వేల టన్నుల ధాన్యం తరలింపుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
జిల్లాలోని వరంగల్ హనుమకొండ జిల్లాల లోని మిల్లులకు దాన్యం తరలిస్తున్నమన్నారు. మిల్లుల కొరత ఉందని మంత్రికి విన్నవించగా సూర్యాపేట జిల్లాలోని మిల్లులకు పంపించాలన్నారు.
రవాణాలో వాహనాల కొరత లేకుండా ట్రాక్టర్ల సైతం ఏర్పాటు చేసుకోవాలన్నారు నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేపట్టాలని తరుగు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఆదనపు కలెక్టర్ డేవిడ్ ఆర్డిఓ రమేష్ పౌర సరఫరాల అధికారి నర్సింగరావు డిఎం సివిల్ సప్లై కృష్ణవేణి వ్యవసాయ అధికారి చత్రు నాయక్ ఉద్యాన అధికారి సూర్యనారాయణ ఆర్టిఏ రమేష్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.