Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

కొత్తూరు టిడ్కో ఇంట ఈగల మోత

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మే 24,(నిజం న్యూస్) బ్యూరో ::

అడుగు తీస్తే ఈగలు.ఈగలతో నానా ఇక్కట్లు పడుతున్నారు కొత్తూరు టిడ్కో గృహ నివాసులు. కొత్తూరు అపార్ట్మెంట్లు చుట్టూ ఈగల వలయంలో చిక్కుకుని విలవిలలాడుతున్నారు అపార్ట్మెంట్ వాసులు. జగనన్న ఇంటింటికి ఈగల పథకం అన్నట్లుగా ఉంది ఇక్కడి పరిస్థితి. మీ పాట్లు మీరు పడండి అని చెప్పి చక్కగా ప్లాట్లలోకి జనాన్ని పంపించిన, ప్రజాప్రతినిధులు, అధికారులు
టిడ్కో గృహాల వైపుకి ఇంతవరకు ఒకసారి అయినా తొంగి చూడకపోవడం విశేషం. ఇలా తలుపు తీస్తే చాలు ఈగలన్నీ ఇంట్లోకి చొరబడి తినే ఆహార పదార్థాలపై వాలుతూ వాటిపై దాడి చేస్తున్నాయని టిడ్కో వాసులు అంటున్నారు.

ALSO READ: నేటి నుండి రోహిణి కార్తే

తినడానికి అన్నం, నీళ్లు సైతం సహించడం లేదని వాళ్లు విలపిస్తున్నారు. తినే ఆహార పదార్థాలపై ఈగలు వాలి లార్వాను విసర్జిస్తాయి. మనం ఆ పదార్థాలను తినడం వల్ల , టైఫాయిడ్, డయేరియా, నీళ్ల విరోచనాలు, అనేక రకాలైన కళ్ళకు సంబంధించిన వ్యాధులు బారిన పడతారని డాక్టర్లు చెబుతున్నారు.

ఈ విధమైన రోగాల బారిన పడిన టిడ్కో వాసులు పదుల సంఖ్యలో హాస్పిటల్ పాలైతేనే గాని అధికారులు, ప్రజా ప్రతినిధులు ఇటువైపు చూడరేమోనని కాలనీవాసులు పలువురు అభిప్రాయపడుతున్నారు.

రామచంద్రపురం పురపాలక సంఘం అధికారులు ఈ సమస్యను చిన్నదిగా చూడకుండా ఈగల సమస్యపై వీలైనంత త్వరగా స్పందించి ప్రజారోగ్యాన్ని కాపాడాల్సిందని టిడ్కో వాసులు కోరుతున్నారు.