Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

33 జిల్లాల్లో మెడికల్ కాలేజీల ఏర్పాటు

పేదలకు ప్రజలకు మెరుగైన వైద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యం

*డయాలసిస్ సెంటర్ ను ప్రారంభించిన…

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు

జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్

మణుగూరు మే 24 (నిజం న్యూస్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం లోని వంద పడకల ప్రభుత్వాసుపత్రి నందు సుమారు 50 లక్షల రూపాయల అంచనా వ్యయంతో ఏర్పాటు చేసుకున్న డయాలసిస్ సెంటర్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ , పినపాక శాసనసభ్యులు , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బి ఆర్ యస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ హాజరై  ప్రారంభోత్సవం చేయడం జరిగింది,

అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు.  ఈసందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా బిఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తున్నదని అన్నారు 50 లక్షల రూపాయల అంచనా వ్యయంతో ఏర్పాటు చేసుకున్న డయాలసిస్ వైద్య సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చామని ఆయన వివరించారు

మూత్రపిండాల సమస్యలు ఉన్న రోగులకు డయాలసిస్ అవసరపడుతున్నదని ఈ వైద్యాన్ని పొందేందుకు వేల రూపాయల ఖర్చు చేసుకోవాల్సిన అవసరం వస్తుందని చెప్పారు, రోగికి వైద్య ఖర్చు భారం కాకూడదనే ఉచిత డయాలసిస్ కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చామన్నారు.

ALSO READ: అక్రమ షెడ్డు కు అండగా నిలుస్తున్న అధికారి

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు కేవలం ఉస్మానియా, గాంధీ, నిమ్స్ , ఆస్పత్రులలో ఈ సౌకర్యం మాత్రమే ఉండేవని ఈ సమస్యను పరిష్కరించగా డయాలసిస్ కేంద్రాల సంఖ్యను తెలంగాణ ప్రభుత్వం 3 నుంచి 102 కు పెంచింది అని, మరికొన్ని పెంచాలని లక్ష్యంతో ఉందని ఈ యుద్ధ ప్రాతిపదికన వీటిని ఏర్పాటు చేస్తున్నదని అన్నారు

డయాలసిస్ సెంటర్ ఏర్పాటుకు సహకరించిన సీఎం కేసీఆర్ మంత్రివర్యులు ,  పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు వైద్య ఆరోగ్యశాఖ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావుకి, జిల్లా అధికారులకు, ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ప్రభుత్వ ఆసుపత్రులను ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని వైద్య సేవలు పొందాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని అన్నారు

డయాలసిస్ కోసం ప్రజలు హైదరాబాదు మరియు ఇతర ప్రాంతాలకు వెళ్లి వైద్యం చేయించుకుంటూ అనేక ఇబ్బందులకు గురవుతున్నారని వాటన్నిటిని దూరం చేసేదందుకు తెలంగాణ ప్రభుత్వం మణుగూరు మండలం ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేసిందని ఆయన తెలిపారు
సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నదని తెలిపారు జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉండాలనే ఉద్దేశంతో 33 జిల్లాలకు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారని ఆయన అన్నారు.

అన్ని రకాల వైద్య సేవలు ఉండాలని కార్పొరేట్ స్థాయి వైద్యం పేదలకు ప్రభుత్వం ఆసుపత్రులలో అందిస్తున్నదని అన్నారు ఈ కార్యక్రమంలో పలు శాఖల ప్రభుత్వ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పలువురు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు