నాగర్‌కర్నూల్ జిల్లాలో భారీ వర్షం

అప్పపీడన ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలో 26.9 మి.మీ వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొల్లాపూర్ మండలంలోని ముక్కిడిగుండం – నార్లాపూర్ మధ్య ఎర్రగట్టు పెద్దవాగు పొంగి పొర్లుతున్నది. వాగును దాటుతుండగా ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడింది. స్థానికులు తాళ్లుకట్టి జేసీబీ సహాయంతో తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో ఇండ్ల మధ్యకు నీళ్లు చేరాయి._