అక్రమ షెడ్డు కు అండగా నిలుస్తున్న అధికారి

మహాదేవపురంలో అక్రమ షెడ్డు కు అండగా నిలుస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారి నరేష్.
*ఫిర్యాదులు చేసిన పట్టించుకోని పట్టణ ప్రణాళిక అధికారి నరేష్..
*రాజకీయ నాయకుల అడుగులకు మడుగులు ఒత్తుతున్న టౌన్ ప్లానింగ్ అధికారి నరేష్.
కుత్బుల్లాపూర్ : మే 24 (నిజం న్యూస్)
నగరంలో రోజుకు రోజుకు వెలుస్తున్న అక్రమ షెడ్లను తొలగించడంలో నిర్లక్ష్యం వహిస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులపై ప్రజలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
జిహెచ్ఎంసికి గండిపడేలా వ్యవహరిస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానికుల ఆరోపిస్తున్నారు.
ALSO READ: గీత కార్మికులకు లైసెన్స్ ల పంపిణీ
గాజుల రామారం లోని సర్కిల్ 26 పరిధిలో మహాదేవపురం లో విచ్చలవిడిగా అక్రమ షెడ్యూలు వెలుస్తున్నప్పటికీ తమకేం పట్టదు అన్నట్లు టౌన్ ప్లానింగ్ అధికారులు వ్యవహరిస్తుండడంతో కోట్ల రూపాయలు జిహెచ్ఎంసి కు రావలసిన పన్ను కు గండిపడుతుంది.
అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వారిపై చర్యలు తీసుకోకుండా వారితో కుమ్మక్కై అయినట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు.
ఇప్పటికైనా టౌన్ ప్లానింగ్ అధికారులు అక్రమార్కులకు అండగా నిలవకుండా, ప్రభుత్వ ఖజానాకు రావలసిన సొమ్మును వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.