గీత కార్మికులకు లైసెన్స్ ల పంపిణీ
కుతుబ్ షా పురంలో కళ్ళు గీత కార్మికులకు లైసెన్స్ లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
గీత కార్మిక సంగం సొసైటీ పునరుద్ధరణ
గరిడేపల్లి మే 24 (నిజం న్యూస్)
హుజూర్నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి ఈరోజు గరిడేపల్లి మండలంలోని కుతుబ్ షా పురంలో 130 మంది గీత కార్మికులకు ఆబ్కారి శాఖ నుంచి లైసెన్స్లను మంజూరు చేపించి తమ స్వస్థలతో పంపిణీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ కులవృత్తులను గౌరవించి వారిని ప్రోత్సహించి వారికి పెన్షన్లను మంజూరు చేపిస్తున్నటువంటి ఘనత కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని దేనని.. రైతుబంధు తరహాలో గీత బందును కూడా అమలు చేస్తారని ఎవరైనా గీత కార్మికులు మరణిస్తే 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఎక్స్గ్రేషియా అందజేస్తారని త్వరలోనే చేయూత పథకం ద్వారా లక్ష రూపాయల ను కూడా అందజేస్తారని దీనికి రూపకర్త మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు అని తెలియజేయడం జరిగింది.
ALSO READ: చేపలు పట్టేందుకు చెరువులు ఖాళీ
అదేవిధంగా కుతుబ్ షా పురంలో గీత సంఘం సొసైటీని పునరుద్ధరించడం జరిగిందని తద్వారా సొసైటీ ద్వారా లోన్లు మరియు పరికరాలు మరియు గౌడ కార్మికులకు మోపెడ్స్ ను మంజూరు చేసే క్రమంలో సొసైటీ ద్వారా ఈటువంటి కార్యక్రమాలు జరుగుతాయని తెలియజేయడం జరిగింది.
ఈ సందర్భంగా లైసెన్సుల మంజూరిలో మరియు సొసైటీ పునరుద్ధరణలో క్రియాశీలక పాత్రను పోషించిన గౌడ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ప్రసాద్ ని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అభినందించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కడియం వెంకట్ రెడ్డి , మాజీ జెడ్పిటిసి పెండెం శ్రీనివాస్ గౌడ్, తాళ్ల మల్కాపురం మాజీ ఎంపిటిసి కుక్కడపు గురవయ్య , కుతుబ్ షా పురం సర్పంచ్ విరమ్మ భాస్కర్ , ఎంపీటీసీ అరుణ బిక్షం,గౌడ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ప్రసాద్ , అరవింద్ ,మోహన్ పెద్దలు ,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.