చేపలు పట్టేందుకు చెరువులు ఖాళీ
ఆత్మకూర్ ఎస్ మే 24 (నిజం న్యూస్):
చెరువులో చేపలు పట్టేది గాను రాత్రి కి రాత్రి అక్రమంగా తూముల ద్వారా చెరువు నీటిని వదులుతున్నారు. ఆత్మకూరు మండల కేంద్రంలోని పెద్ద చెరువులోని నీటిని చేపల కాంట్రాక్టర్ అక్రమంగా నీటిని తోడేస్తున్నాడని రైతులు ఆరోపిస్తున్నారు.
సుమారు 250 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువు పరిధిలో వేల ఎకరాల భూమి సాగుతుందని వచ్చే ఏడాది వర్షాలు వస్తాయో రావో తెలియక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెరువు కింద మూడు గ్రామాల ప్రజలు వ్యవసాయపరంగా ఆధారపడి బతుకుతున్నారు.
ALSO READ: ప్రభుత్వ వైద్యానికి స్వర్గసీమగా తెలంగాణ
గత నెల రోజులుగా చెరువు నుండి చేపల కాంట్రాక్టర్ అక్రమంగా నీటిని తోడేస్తున్నాడని రెవిన్యూ ఇరిగేషన్ అధికారులకు రైతులు ఫిర్యాదు చేసిన పట్టించుకోకుండా అధికార పార్టీ నాయకులు పేర్లు చెప్పుకొని దౌర్జన్యంగా నీటిని తోడేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
అధికారులు స్పందించి నీటి తరలింపును అడ్డుకోవాలని చేపల కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
తహసిల్దార్ వివరణ.
పెద్ద చెరువు నుండి అక్రమంగా తరలించిన చేపల కాంట్రాక్టర్ పై చట్టపరంగా చర్య తీసుకుంటామని తాహసిల్దార్ పుష్ప వివరణ ఇచ్చారు. వెంటనే రెవెన్యూ సిబ్బందినీ పంపించి నీటి తరలింపును అడ్డుకుంటామని వారు తెలిపారు..