Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ప్రభుత్వ వైద్యానికి స్వర్గసీమగా తెలంగాణ

వైద్య రంగంలో దేశానికే దిక్సూచి తెలంగాణ

మునగాల మండల కేంద్రం లో కోటి 56లక్షల వ్యయం తో నిర్మించనున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనానికి శంకుస్థాపన చేసిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆయన వెంట కోదాడ ఎమ్మెల్యే బోల్లం మల్లయ్య యాదవ్ ఉన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.వైద్య రంగంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన చర్యల తోనే రాష్ట్రం లో వైద్య విప్లవం కొనసాగుతుందని మంత్రి అన్నారు.

ప్రభుత్వ వైద్యానికి స్వర్గసీమ గా తెలంగాణ రాష్టం అవతరించిందని అన్నారు. కేసీఆర్ చర్యలే దీనికి కారణం అన్న మంత్రి,ఆరోగ్య తెలంగాణ నే ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్యేయం అన్నారు. కేసీఆర్ సారథ్యం లో రాష్ట్రం విద్య, వైద్య రంగాల్లో అద్భుతాలు సృష్టిస్తుందన్నారు.

ALSO READ: నకిలీ విత్తనాలను అమ్మితే దుకాణాలు సీజ్

అటు పల్లెలనుంచి మొదలు, పట్టణాల్లో బస్తీ దవఖానాలు తో ఊహలకందని వైద్యసదుపాయాలు అందుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారూ అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో ఉచితంగా టెస్టులు కూడా చేస్తున్నామన్నారు.

ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో సైతం అధునాతమైన వైద్య పరికారాలు అందుబాటులోకి తెచ్చామన్నారు .ఊహించని ఆపరేషన్లు కూడా ప్రభుత్వాసుపత్రుల్లో చేపడుతున్నామన్నారు.

ఇదంతా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్‌ కలల రూపంలో ఒక అద్భుత ఆవిష్కారం…వైద్యం పేదలకు అందుబాటులోకి తెచ్చిన సాక్ష్యాత్కారం అన్నారు .

తెలంగాణలో విద్య, వైద్యం, ఉపాధి రంగాలకు కొదువ లేకుండా చేయడంలో ముఖ్యమంత్రి కేసిఆర్‌ చూపిన చొరవ ప్రపంచమంతా కీర్తిస్తోంది అన్నారు ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు నాయకులు అధికారులు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.