Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

నకిలీ విత్తనాలను అమ్మితే దుకాణాలు సీజ్

విత్తన దుకాణాలను తనిఖీ చేసిన ఏడిఏ, ఏవో

-రైతులు విత్తనాలు కొన్నప్పుడు బిల్ తప్పనిసరి గా తీసుకోండి.

చేవెళ్ల మే 24(నిజం న్యూస్):
చేవెళ్ల మండల పరిధిలోని విత్తన దుకాణాలను వ్యవసాయ శాఖ ఏడిఏ రమా దేవి మరియు ఏవో తులసి కలిసి తనిఖీ చేసారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డీలర్లకు సుచిక బోర్డుపై ధరల పట్టికను ఏర్పాటు చేయాలన్నారు,స్టాక్ రిజిస్టార్ వివరాలు సరిగ్గా నమోదు చేసుకోవాలని సూచించారు.

ALSO READ: అంతర్గత కుమ్ములాటలే ఆయనకు కలిసొస్తున్నాయి

ప్రభుత్వ నిబంధనలను పాటిస్తు,నాణ్యమైన విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచాలని కోరారు.నకిలీ విత్తనాలు అమ్మితే దుకాణాలను సీజ్ చేస్తామన్నారు.ఎమ్మార్పీ ధరల కంటే ఎక్కువ ధరలు విక్రాయించినట్లు రుజువైతే సదరు యజమానులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అదేవిదంగా రైతులు విత్తనాలు కొన్నప్పుడు తప్పనిసరిగా బిల్లులు తీసుకొని పంట కాలం పూర్తి అయ్యే వరకు బిల్లు మరియు ప్యాకెట్ ను జాగ్రతగా ఉంచుకోవాలని సూచించారు.