Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

అంతర్గత కుమ్ములాటలే ఆయనకు కలిసొస్తున్నాయి

-ప్రతిపక్ష నేతల్లో కుమ్ములాటలు.
లోకల్ నాన్ లోకల్ ఫీలింగ్.

-బీజేపీ నుండి ముగ్గురు, కాంగ్రెస్ నుండి నలుగురు టికెట్ కి పోటీ.

-ఎమ్మెల్యేకు కలిసొస్తున్న మంచితనం, ప్రతిపక్షాల్లో ఉన్న అంతర్గత కలహాలు.

చేవెళ్ల మే 24(నిజం న్యూస్):
చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య పుట్టిన పల్లెను వదలడు.పగలంతా ప్రయాణం ఎక్కడ సాగినా! అర్ధరాత్రి అయినా! సరే సొంతఊరుకు చేరుతడు.  మూడోసారి గెలిచి యాట్రిక్ కొడతాడని ప్రజల నోట వినిపిస్తుంది. బిఆర్ఎస్ పార్టీ నుంచి మొన్నటి వరకు టికెట్టు విషయంలో గందరగోళం నెలకొంది. కేసిఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్ అని తేల్చడంతో తెరపడింది.

ప్రతిపక్ష పార్టీలలో గట్టి పోటీనిచ్చే నేతలు లేకపోవడం.ఇతర పార్టీలనుంచి చేవెళ్ల ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న వారిలో కనీసం ఎంపీటీసీ, సర్పంచ్ గా గెలవలేని వాళ్లు కూడా ఉన్నారు. చేవెళ్ళ నియోజకవర్గ ఓట్లు దాదాపు రెండు లక్షల 50 వేలు. ఎమ్మెల్యే అవ్వడానికి లక్ష ఓటర్లు ఎన్నుకోవాలి.

తండాల్లో 400 ఆపై ఓట్లల్లో సర్పంచ్ గా నెగ్గాలంటే కనీసం 200 కావాలి. గ్రామ సర్పంచ్ కైతే 750 నుంచి 4000 వేల ఓట్లు. దీనిలో సగం నెగ్గితేనె గెలుపు. ఈ పదవులే నెగ్గ లేని వారు ఎమ్మెల్యే టికెట్ ఆశించడం హాస్యాస్పదం అంటున్నారు ప్రజలు.

ALSO READ: రేపే లా సెట్ పరీక్ష

సర్పంచ్ ఎంపీటీసీగా నెగ్గలేని వారు ఎమ్మెల్యే టికెట్ ఆశించడం ఏంటని నియోజకవర్గ ప్రజలు మాట్లాడుకుంటున్నారు.కొందరు గట్టి నేతలు ఉన్నా లోకల్ నాన్ లోకల్ అనే భావన కూడా ప్రజల్లో ఉంది. ఇతర పార్టీల నుంచి టికెట్ ఆశించిన వాళ్ల బ్యాక్ గ్రౌండ్ విశ్లేషిస్తే చేవెళ్ల గడ్డపై కాలె యాదయ్యకు గట్టి పోటీ లేరని చెప్పొచ్చు.

ఇతర పార్టీలలో అంతర్గత కుమ్ములాటలు ఈయనకు కలిసొస్తున్నాయి. ఎమ్మెల్యే టికెట్ కోసం కాంగ్రెస్ పార్టీ నుంచి నలుగురు, బిజెపి పార్టీ నుంచి ముగ్గురు పోటీపడుతున్నారు. బీఎస్పీ పార్టీ నుంచి అభ్యర్థి ఆచూకీ లేదు.

కమ్యూనిస్టు పార్టీలు బిఆర్ఎస్ తో జతకట్టి కీలకపాత్ర పోషిస్తున్నాయి.ఎనిమిదేళ్ల ఎమ్మెల్యే పాలనలో ఈయనపై ఆరోపణలు కూడ లేకపోవడంతో మూడోసారి గెలిచి యాట్రిక్ కొట్టె అవకాశాలు మెండుగా ఉన్నాయని జనం అంటున్నారు.