Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఏసీబీ అధికారులకు పట్టుబడిన చిల్లకల్లు ఎస్సై

జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు పోలీస్ స్టేషన్లో ఏసీబీ గురువారం దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో

ఎస్సై దుర్గా ప్రసాద్ నగదు తీసుకుంటూ కానిస్టేబుల్ తో సహ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.

గతంలో గుంటూరు కు చెందిన ఒక వ్యక్తిపై బోగ్గు అక్రమ రవాణా కేసు నమోదు చేసి సేష్టన్ బెయిల్ కోసం 5 లక్షల రూపాయలు యస్ఐ దుర్గా ప్రసాద్ డిమాండ్ చేసినట్టు తెలిసింది.

Also read: జూలైలోనే గృహలక్ష్మి పథకం

సునీల్ అనే కీసర గ్రామానికి చెందిన కానిస్టేబుల్ ద్వారా మంతనాలు నడిపి 2 లక్షల రూపాయలు గతంలో ఇచ్చిన బొగ్గు యజమాని తీసుకొని, మిగిలిన 3 లక్షల రూపాయలు తీసుకునే క్రమంలో బొగ్గు యజమాని తన కారులో సునిల్ ను ఎక్కించుకుని ఎస్సై నివాసానికి వెళ్లి డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు