బంధువులని బెడ్ రూమ్ ఇస్తే…ఆ పని చేసి పారిపోయాడు…!!

తెలిసిన బంధువులు కదా ఓ వ్యక్తి తన ఇంట్లో ఆశ్రయం ఇస్తే, ఇంట్లోని నగలు ఎత్తుకుపోయాడు ఓ ప్రబుద్దుడు. అనుమానం వచ్చి అడిగితె తనకేమి తెలియదని బికాయించాడు. పోలీసులు రంగప్రవేశం చేయడంతో విషయం బయటపడింది. ఈ సంఘటన గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో జరిగింది. చెన్నైకి చెందిన ఆలీ హర్మాస్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి చిలకలూరిపేటలోని తన బంధువుల ఇంటికి వచ్చాడు. అలా ఇంటికి వచ్చిన హర్మాస్ కు బంధువు రహీం తన బెడ్ రూమ్ ఇచ్చి అందులో ఉండమన్నారు. అయితే, బెడ్ రూమ్ లో ఉన్న బీరువా తాళాలు తీసి ఉండటంతో హర్మాస్ చేతివాటం చూపించి అందులో ఉంచిన 150 గ్రాముల బంగారం ఆభరణాలు ఎత్తుకొని చెన్నై వెళ్ళాడు. అనుమానం వచ్చిన రహీం అడిగితె తనకేమి తెలియదని బుకాయించాడు. భార్యను తీసుకెళ్లేందుకు తిరిగి చిలకలూరిపేటకు వచ్చిన హర్మాస్ పై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు హార్మాస్ ను అదుపులోకి తీసుకొని విచారించగా నేరం చేసినట్టు ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు బంగారాన్ని రికవరీ చేసి, నిందితుడిని కటకటాల వెనక్కి పంపారు.