ఆయిల్ పామ్ లో అంతర్ పంటగా వరి తప్ప మరేదైనా…

ఆయిల్ పామ్ సాగుకు అంతర్ పంటగా వరి మినహాయించి మొక్కజొన్న, అరటి, పసుపు, మిరప, పొద్దుతిరుగుడు, నువ్వులు, వేరుశనగ, పెసర్లు, మినుము, అలసంద, పూలు, కూరగాయల వంటి పంటలు సాగు చేయవచ్చని వ్యవసాయాధికారులు తెలుపుతున్నారు.
ఆయిల్ పామ్ సాగు వల్ల 4వ సంవత్సరము నుంచి ఎకరానికి లక్షకు పైగా ఆదాయం వస్తుందని, నాటిన ఆయిల్ పామ్ మొక్కను 3 నుండి 4 సంవత్సరాలు కాపాడుకుంటే 30 సంవత్సరాల పాటు మన కుటుంబానికి జీవనోపాధి కల్పిస్తూ ఆయిల్ పామ్ సాగు తోడ్పాటు నిస్తుందని, కోతుల బెడద, ఇతర జంతువుల నుండి ఎలాంటి నష్టం ఉండదని తెలిపారు.
ALSO READ: రాష్ట్ర వ్యాప్తంగా 3208 పల్లె దవాఖానాలు
ఆయిల్ పామ్ సాగు కోసం ఎకరానికి ప్రభుత్వం అందించే సబ్సిడీ, అంతర్ పంటలకు ప్రభుత్వ సహాయం, అంతర్ పంటల ద్వారా వచ్చే ఆదాయం, 4వ సంవత్సరం నుంచి వచ్చే ఆయిల్ పామ్ ఆదాయం వివరాలతో కూడిన కరపత్రాలను తయారు చేసి విస్తృతంగా ప్రచారం చేస్తున్నామని తెలిపారు.