Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

నూతనంగా 2038 ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సబ్ సెంటర్ లు మంజూరు

రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా 2038 ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సబ్ సెంటర్ లను మంజూరు చేశామని, 422 సబ్ సెంటర్ నిర్మాణ పనులు పూర్తి చేశామని, మరో 177 పనులు చివరి దశలో ఉన్నాయని, 610 నిర్మాణ పనులు వివిధ దశలో ఉన్నాయని అధికారులు వివరించారు.

రాష్ట్రంలో 63 సబ్ సెంటర్ భవనాలకు భూకేటాయింపులు జరగలేదని, వీటిపై కలెక్టర్ లు శ్రద్ధ వహించి గ్రామాలలో ప్రజలకు అందుబాటులో ఉండే భూములను ఎంపిక చేసి సబ్ సెంటర్ల కేటాయించాలని, సబ్ సెంటర్ లలో నిర్మాణం కోసం ముందస్తుగా జిల్లా ప్రజా పరిషత్తులకు, పట్టణ ప్రాంతాల్లో మున్సిపాలిటీలకు నిధులను విడుదల చేశామని, వారం రోజులలో మరో 400 కోట్ల నిధులు విడుదల చేస్తామని మంత్రి పేర్కొన్నారు.

ALSO READ: కెసిఆర్ న్యూట్రిషన్ కిట్ పథకం ప్రారంభం ఎప్పుడంటే…

సబ్ సెంటర్ భవన నిర్మాణానికి నిధుల సమస్య లేనందున త్వరితగతిన 766 సబ్ సెంటర్ల టెండర్ల ప్రక్రియ ఫైనల్ చేసి పనులు ప్రారంభించాలని, సబ్ సెంటర్ లను త్వరితగతిన వేగంగా నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావాలని, సబ్ సెంటర్ల నిర్మాణ పురోగతిపై కలెక్టర్లు తరచుగా రివ్యూ నిర్వహించాలని మంత్రి ఆదేశించారు.