రాష్ట్రంలో 1.5 కోట్ల మందికి కంటి పరీక్షలు
రాష్ట్రంలో 1.5 కోట్ల మందికి కంటి పరీక్షలు నిర్వహించి 21.4 లక్షల మందికి రీడింగ్ గ్లాసెస్, 17.08 లక్షల మందికి ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ పంపిణీ చేశామని మంత్రి తెలిపారు.
కంటి వెలుగులో లక్ష్యాన్ని పూర్తి చేసుకున్న 737 బృందాలలోని స్టాఫ్ నర్స్ లు, ఏఎన్ఎమ్ లు, వైద్యాధికారులను ఆసుపత్రు లలో విధులకు పంపాలని, డాటా ఎంట్రీ ఆపరేటర్లు, ఆప్తామాలజిస్టులను మిగిలి ఉన్న కంటి వెలుగు బృందాలకు అటాచ్ చేసి మరింత విస్తృతంగా ప్రజలకు పరీక్షలు నిర్వహించాలని మంత్రి సూచించారు.
ALSO READ: నూతనంగా 2038 ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సబ్ సెంటర్ లు మంజూరు
సిపిఆర్ శిక్షణ పై వైద్యాధికారులు శ్రద్ధ వహించాలని, నిర్దేశించుకున్న లక్ష్యం మేరకు సి పి ఆర్ ఫై శిక్షణ కార్యక్రమంలో నిర్వహించాలని మంత్రి సూచించారు.
రాష్ట్రవ్యాప్తంగా మరో 15 రోజుల పాటు తీవ్రమైన ఎండలు ఉంటాయని, ఎండల కారణంగా వడదెబ్బ బారిన ప్రజలు పడకుండా అవసరమైన సూచనలు సలహాలు అందజేయాలని, ఉపాధి హామీ కార్మికులు పనిచేసే సమయంలో అవసరమైన జాగ్రత్తలు పాటించాలని మంత్రి సూచించారు.