రాష్ట్ర వ్యాప్తంగా 3208 పల్లె దవాఖానాలు
రాష్ట్ర వ్యాప్తంగా 3208 పల్లె దవాఖానాలు ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతంలో ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని, వీటిలో ఇప్పటికే 2995 మైల్డ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లను నియమించామని, ప్రస్తుతం ఖాళీగా ఉన్న 211 పోస్టులను జిల్లా స్థాయిలో భర్తీ చేయాలని మంత్రి తెలిపారు.
ALSO READ: రాష్ట్రంలో 1.5 కోట్ల మందికి కంటి పరీక్షలు
ఎం.ఎల్.హెచ్.పి కింద ఎంపిక చేసిన 1141 బి.ఎ.ఎంఎస్ అభ్యర్థులకు 6 నెలల పాటు బ్రిడ్జి కోర్స్ శిక్షణ అందించాలని వీటిలో ఇప్పటివరకు 708 మంది అభ్యర్ధులకు శిక్షణ పూర్తి చేశామని, 201 మంది అభ్యర్థులకు శిక్షణ ప్రక్రియ జరుగుతుందని, కంటి వెలుగు కార్యక్రమం చివరి దశకు వచ్చినందున మిగిలిన అభ్యర్థులకు సైతం బ్రిడ్జి కోర్సు ప్రారంభించాలని మంత్రి పేర్కొన్నారు.
80 పనిదినాలు లో రాష్ట్రవ్యాప్తంగా కోటిన్నర మంది ప్రజలకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా కంటి పరీక్షలను విజయవంతంగా నిర్వహించి నందుకు మంత్రి కలెక్టర్లను,వైద్య సిబ్బందిని అభినందించారు.