ఆయిల్ పామ్ తో 25-30 సంవత్సరాల వరకు ఆదాయం
ఆయిల్ పామ్ పంట సాగుపై రైతులకు అవగాహన సదస్సు
బోయినిపల్లి, మే 23 (నిజం న్యూస్;)
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం విలసాగర్ రైతువేదిక నందు ఆయిల్ పామ్ పంట సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది.
ఉద్యాన వన అధికారి గోవర్ధన్ మాట్లాడుతూ: మన దేశం వంట నూనెలను దిగుమతి చేసుకుంటుందని,దానిని తగ్గించుకోవడానికి ప్రభుత్వం వివిధ ప్రోత్సాహకాలను రైతులకు ఇస్తుందని,ఆయిల్ పామ్ పంటకు సమృద్ధిగా సాగు నీరు ఉండే నేలలు,నీరు నిలవని అన్ని రకాల నేలలు అనుకూలమని,ఒక ఎకరా వరి సాగుకు అవసరమయ్యే నీటితో 3-4 ఎకరాల ఆయిల్ పామ్ సాగు చేసుకోవచ్చు.
ALSO READ: ఓటు హక్కును కల్పించిన ఘనత అంబేద్కర్ దే
ఆసక్తి గల రైతులు తమ పట్టాధర్ పాస్ బుక్,ఆధార్ కార్డ్,బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ లు, 2 పాస్పోర్ట్ ఫోటోలు మీ వ్యవసాయ విస్తీర్ణ అధికారికి ఇవ్వవలసిందిగా రైతులకు విజ్ఞప్తి చేశారు. ఇలా సాంక్షన్ పొందిన రైతులకు ఒక సంవత్సరం వయస్సున్న మొక్కలను కంపెనీ వారు 50 మొక్కలు(9X9మీ. దూరం) ఎకరానికి చొప్పున ఇస్తారు.
మొక్క నాటిన మూడు సంవత్సరాల తర్వాత పంట మొదలవుతుంది.ఈ మధ్య కాలంలో అంతర పంటలుగా మొక్కజొన్న,అరటి,పొద్దు తిరుగుడు,పెసలు,మినుములు,నువ్వులు,పూలు,పసుపు, కూరగాయలు, ప్రత్తి సాగు చేసుకోవచ్చు.
దీనికి ఎకరానికి సంవత్సరానికి 4200 రూ. ప్రోత్సాహకంను,రాయితీ పై మొక్కలు మరియు డ్రిప్ ని తెలంగాణ ప్రభుత్వం అందిస్తుంది.ప్రకృతి వైపరిత్యాలు తట్టుకుని,కోతుల బెడద ఉండని,పంట అని తెలిపారు.
నాటిన 4 వ సంవత్సరం నుండి 25-30 సంవత్సరాల వరకు ప్రతి నెల నిరంతర ఆదాయం వస్తుంది, పీయునిక్ కంపెనీ వారు రైతులకు పంట కొనుగోలు విషయంలో ఒప్పంద పత్రం కూడా ఇస్తారని, రైతులు ఉపయోగించుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమానికి ఎంపీపీ పర్లపల్లి వేణు గోపాల్,గ్రామ రైతు బంధు సమితి కో ఆర్డినేటర్ ముదిగంటి సంతు ప్రకాష్ రెడ్డి,ప్రజా ప్రతినిధులు జులపల్లి అంజన్ కుమార్, వేములవాడ క్లస్టర్ ఉద్యాన వన శాఖ అధికారి గోవర్ధన్, మండల వ్యవసాయ అధికారిని ప్రణీత, ఏఈఓ రజిత, ప్రీయునిక్ కంపెనీ ప్రతినిధి నిషాంత్, రైతులు పాల్గొన్నారు.