ఓటు హక్కును కల్పించిన ఘనత అంబేద్కర్ దే
అంబేద్కర్ ఆశయాలను ….సాధిద్దాం
దేశంలో ఓటు హక్కును కల్పించిన ఘనత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ది.
ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్, జడ్పీ చైర్ పర్సన్ దీపిక యుగంధర్ రావు
తుంగతుర్తి మే 23 నిజం న్యూస్
తుంగతుర్తి మండల పరిధిలోని బండారామారంలో నూతన అంబేద్కర్ విగ్రహం ప్రారంభోత్సవం చేసిన ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ జడ్పీ చైర్పర్సన్ దీపికా యుగంధర్ రావు లు మాట్లాడుతూ భారతదేశంలో ప్రజలందరికీ ఓటు హక్కును కల్పించిన ఘనత భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని అన్నారు.
Also read: స్మశాన భూమిని కబ్జా చేయడం సరికాదు
రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ తో తెలంగాణ రాష్ట్ర ఏర్పడిందని అన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ప్రత్యేకంగా రాజ్యాంగం తో నేడు రిజర్వేషన్లు కల్పించి ఉన్నతమైన ఉద్యోగ అవకాశాలు రాజకీయంగా ప్రజలు రాణిస్తున్నారు.
అంబేద్కర్ స్ఫూర్తితో యువత ఆయన అడుగుజాడల్లో నడుస్తూ అభివృద్ధి ఫలాలు పొందుతూ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో డిసిసిబి డైరెక్టర్ గుడిపాటి సైదులు ఎంపీపీ గుండె గాని కవితా రాములు గౌడ్ వైస్ ఎంపీపీ శ్రీశైలం యాదవ్ పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య చెరుకు సృజనా పరమేష్ తడకమల రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.