Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

స్మశాన భూమిని కబ్జా చేయడం సరికాదు

కబ్జాదారులపై చర్యలు తీసుకోండి

-చిల్ల మౌలాలీ మేనేజింగ్ కమిటీ ప్రెసిడెంట్ మహమ్మద్ షఫీయుద్దీన్.

-భూ ఆక్రమణకు యత్నించిన కబ్జాకారులపై చర్యలు తీసుకోవాలని తహసిల్దార్,ఆర్డీఓ కు పిర్యాదు.

చేవెళ్ల మే 22 (నిజం న్యూస్ ):
చేవెళ్ల మండల కేంద్రంలోని సర్వేనెంబర్ 6/1 లో ముస్లిం మైనారిటీలకు కేటాయించిన 4-35 గుంటల భూమిని ఈద్గా దర్గా,గ్రేవ్ యార్డ్ ( స్మశాన వాటిక )కు ప్రభుత్వం అలాట్మెంట్ చేసింది.

ఈ భూమిలో కొందరు వ్యక్తులు ముగ్గు వేసి,కబ్జాలకు,పాల్పడుతున్నారన్నారు.వెంటనే వీరిపై అధికారులు చఠరీత్య చర్యలు తీసుకోవాలని చిల్లమౌలా అలీ మేనేజింగ్ కమిటీ ప్రెసిడెంట్ మహమ్మద్ షఫీయుద్దీన్ డిమాండ్ చేశారు.

ALSO READ: ఏకధాటిగా 10 గంటల పాటు కళా ప్రదర్శన

ఈ విషయం గూర్చి స్థానిక ఆర్డిఓ, ఎమ్మార్వోకు ఫిర్యాదు చేశామన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…రాష్ట్రంలో వక్ బోర్డు, ప్రభుత్వ భూములను కాపాడే హక్కు ప్రతి ఒక్కరిది అని అన్నారు.

భూమి ఖాళీగా కనిపించిందా అధికారులతో కుమ్మక్కై రాజకీయ నాయకుల అండదండలతో కొందరు కబ్జాకు పాల్పడుతున్నారని అన్నారు. స్మశాన స్థలం కూడ కబ్జాలు చేయడం సిగ్గుచేటన్నారు.

ముస్లిం మైనారిటీలకు ఇచ్చిన భూములపై ఎందుకింత వివక్షని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కూడా కబ్జాకు ప్రయత్నిస్తే ఆర్డిఓ దృష్టికితీసుకువెళ్ళమన్నారు. పదేపదే స్మశానభూమి కబ్జాకు ప్రయత్నించడం సరికాదన్నారు.

ఈ భూముల జోలికొస్తే ఊరుకునేది లేదని వారు హెచ్చరించారు. వెంటనే అధికారులు స్పందించి ముగ్గు వేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాని తాసిల్దార్,ఆర్డీవోకు వినతి ఫిర్యాదు చేశారు.

ఈ స్మశాన వాటిక భూమిని కాపాడాల్సిన బాధ్యత అధికారులదే అన్నారు. అక్రమ నిర్మాణాలకు పాల్పడితే పోలీస్ లకు కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.