ఇది కథకాదు సినిమాతో శరత్ బాబు కు మంచి గుర్తింపు
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మే 22,(నిజం న్యూస్) బ్యూరో : 1951 జులై 31న శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో జన్మించిన శరత్ బాబు అసలు పేరు సత్యంబాబు దీక్షితులు. 1973లో రామరాజ్యం చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన శరత్ బాబు హీరోగా, విలన్‌గా, సహాయ నటుడిగా అనేక పాత్రలు పోషించిన శరత్ బాబు సినీ వినీలాకశంలో
మేటి నటునిగా ఆయన జీవించారు.
తెలుగులో కె. బాలచందర్ దర్శకత్వంలోనే వచ్చిన ‘ఇది కథకాదు’ సినిమాతో శరత్ బాబు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కమల్ హాసన్, జయసుధ, చిరంజీవిలతో కలిసి ఈ సినిమాలో శరత్ బాబు నటించారు.
ALSO READ: క్యాన్సర్ ప్రాథమిక స్థాయిలోనే గుర్తించాలి
‘మరో చరిత్ర’, ‘మూడు ముళ్ల బంధం’, ‘తాయారమ్మ బంగారయ్య’, ‘సీతాకోక చిలుక’, ‘శరణం అయ్యప్ప’, ‘స్వాతిముత్యం’, ‘సంసారం ఒక చదరంగం’, ‘అభినందన’, ‘కోకిల’, ‘ఆపద్భాందవుడు’, ‘సాగర సంగమం’, ‘బొబ్బిలి సింహం’, ‘అన్నయ్య’ వంటి సినిమాలు శరత్ బాబును స్టార్ యాక్టర్ ను చేశాయి. తెలుగు, తమిళ భాషల్లో కలిపి ఆయన 300కు పైగా సినిమాల్లో నటించారు.
శరత్ బాబు (71 ) సోమవారం కన్నుమూశారు. హైదరాబాదు ఏఐజి హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఏప్రిల్ 20 నుంచి ఏఐజి హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న శరత్ బాబు. మల్టీ ఆర్గాన్స్ పూర్తిగా డ్యామేజ్ అవ్వడంతో ఆయన మృతి చెందారు.