ఈ గ్రామానికి అరిష్టం వచ్చిందంట..?
-కుతుబ్ షా పురంలో మూఢనమ్మకాలు
గరిడేపల్లి మే 21 నిజం న్యూస్: కాలంతోపాటు ప్రజలు మారుతున్న ఈ ఆధునిక యుగంలో ప్రభుత్వాలు ఎన్నో సంస్కరణలు చేపట్టి అరచేతిలో ప్రపంచం చూపెడుతున్న నేటి కాలం.
అయినా సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలంలోని ఓ గ్రామంలో మూఢనమ్మకాలు రాజ్యమేళుతున్నాయంటే అతిశయోక్తి కాదు.
మండలంలోని కుతుబ్ షా పురం గ్రామంలో ఒక వింత సంఘటన ఈనెల 21న జరిగింది.
ఆలయంలో పూజలు నిర్వహించే పూరోహితులు, గ్రామ పెద్దలు మాట్లాడుతూ
ALSO READ: పచ్చని చెట్లను తొలగించి మరీ బ్లాస్టింగ్
గ్రామంలో 50 రోజుల వ్యవధిలో వెంట వెంటనే 8మంది మృతి చెందడం తో గ్రామానికి అరిష్టం వచ్చిందని ఆ అరిష్టం పోయి, శుభం కలిగి ప్రజలందరూ క్షేమంగా ఉండాలంటే ఈనెల 21న అనగా ఆదివారం ఉదయం 5గంటల నుంచి 11 వరకు ప్రతి ఒక్కరూ గ్రామాన్ని విడిచి పెట్టాలని ప్రకటన జారి చేసినట్లు తెలిపారు.
11గంటలకి గ్రామంలో కి తిరిగి వచ్చేటప్పుడు నిప్పు కొనుక్కొని వచ్చి యధావిధిగా వారి ఇండ్లను శుభ్ర పరుచుకోవాలని, ఆదే నిప్పుతో మధ్యాహ్నం, సాయంత్రానికి కావాల్సిన వంట చేసుకోవాలని సూచించారు. గ్రామానికి నాలుగు వైపులా నిప్పు అమ్మే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది అని తెలిపారు.
ఇలాంటి మూఢనమ్మకాలు ఇంకా పాటించిస్తున్న గ్రామ ప్రజలకు పోలీసులు ఎటువంటి అవగహన కల్పించక పోవడంతో గమనార్హం…ఈ మూఢనమ్మకాలు ఎటు వైపు దారి తీస్తాయో వేసి చూడాల్సిందే…