Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

పచ్చని చెట్లను తొలగించి మరీ బ్లాస్టింగ్

అక్రమ మైనింగ్ తో అడ్డాకుల పంటలు మాయం..

జిన్నారం మే 21( నిజం న్యూస్)

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల్
మాదారం గ్రామంప్రభుత్వ భూమిలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా తెళ్లరాళ్ల పలుగు గుట్టపై మైనింగ్ త్రవ్వకాలు జరుపుతున్నారు.

కోట్ల విలువ చేసే తెల్లరాయిని, రాత్రి పగలు తేడా లేకుండా పదుల సంఖ్యలో బెంజ్ లారీల ఓవర్ లోడ్ తో కొల్లగొడుతూ మైనింగ్ మాఫియా అమ్ముకొని జేబులు నింపుకుంటున్నారని ఇంత జరుగుతున్నా మైనింగ్ , రెవెన్యూ అధికారులు ఇటువైపు కన్నీటి చూడలేదని అడిగే నాధుడే లేడని ప్రజలు మండిపడుతున్నారు.

ALSO READ: చెన్నూరులో బస్సు డిపో ఏర్పాటుకు సన్నాహాలు
నిబంధనలకు విరుద్ధంగా పచ్చని చెట్లను తొలగించి ప్రకృతి వనరులను దోచేస్తున్నారని, అక్రమ బ్లాస్టింగ్ లతో అడ్డాకుల,మిషన్ భగీరథ ట్యాంకుకు పగుళ్లు వచ్చాయని దగ్గర్లో ఉన్న ఇండ్లకు కూడా పగుళ్లు రావడం జరిగింది

మాదారం అంటే అందమైన గట్టులున్న ప్రాంతం అటు ఇటు చెరువు చుట్టూ ఉన్న పంటలు. ఇంతటి సుందరమైన ప్రాంతాన్ని మైనింగ్ పేరుతో కొన్ని రోజులుగా మైనింగ్ గుట్టల పేలుతో భయానికి గురవుతున్న ప్రజలు ఇల్లు ,గుట్టలు , పంట పొలాలు, చెట్లు, జంతువులు, నాశనం అవుతున్నాయి,

రోడ్డు రవాణా లారీలు తిరగడంతో దారుణంగా గుంతలతో దుమ్ముతో బాధపడుతున్న ప్రజలు. ఈ సమస్యని కలెక్టర్ కి చర్చిస్తామని అన్నారు