Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

దొంగ నోట్ల ముద్రణ వెంటనే ఆపాలి

.. మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ

ధర్మవరం: మే 21 (నిజం న్యూస్,) నియోజకవర్గమైన ధర్మవరంలో దొంగ నోట్ల చలామణిని ముద్రణ ను వెనివెంటనే ఆపాలని మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని తన వ్యక్తిగత కార్యాలయంలో ఆదివారం వారు విలేకరులతో పలు విషయాలను వెల్లడించారు.

అనంతరం వారు మాట్లాడుతూ గత ఆరు నెలలుగా ధర్మవరమును కేంద్రంగా చేసుకొని దొంగ నోట్ల చలామణి జరుగుతోందని వారు తెలిపారు. 2009 అండ్ 2014 లో 500 రూపాయల దొంగ నోట్లు రావడంతో ప్రజలు తీవ్రంగా భయపడి పోయారని తెలిపారు.

ALSO READ: ఏపీ మోడల్ స్కూల్ లో ఇంటర్ ప్రవేశానికి దరఖాస్తు చేసుకోండి

తిరిగి ధర్మారం నుండి దొంగ నోటు చలామణి అవుతున్న సంబంధిత అధికారులు పట్టి, పట్టినట్లు వ్యవహరించడం సరైన పద్ధతి కాదని వారు తెలిపారు. నియోజకవర్గ ప్రజలకు కావలసింది అభివృద్ధి మాత్రమేనని నకిలీ, దొంగ నోట్లు కాదని తెలిపారు. దొంగ నోట్ల ను పోలీసులు నివారించవలసి ఉందని, ఆ నివారణ బాధ్యత పోలీసులు దేనిని వారు గుర్తు చేశారు.

అసలు ధర్మవరంలో ఈ దొంగ నోట్లను ఎక్కడ ముద్రిస్తున్నారు?ఎలా చలామణి చేస్తున్నారు ?అనే దానిపైన పోలీసులు ప్రత్యేక నిఘా పెడితే గాని సమస్య తీరదని వారు సూచించారు. ఈ దొంగ నోట్ల ముద్రణ చలామణిపై నేడే ఎస్పి కు ఫిర్యాదు చేయనున్నట్లు వారు తెలిపారు.

అదేవిధంగా ఇక్కడి దొంగ నోట్ల తతంగానంత కూడా కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలిపి, సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేస్తానని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో చికిచెర్ల అరవింద్ రెడ్డి,గిరిధర్, తుంపర్తి పరమేష్, శీన, డిష్ రాజు, రాప్తాటి రాము, లక్ష్మీనారాయణ,నబీ రసూల్ తదితరులు పాల్గొన్నారు.