ఏపీ మోడల్ స్కూల్ లో ఇంటర్ ప్రవేశానికి దరఖాస్తు చేసుకోండి

ఈ నెల 22.05.2023 నుండి 07.06.2023 వరకు
(కర్నూలు జిల్లా) పెద్దకడబూరు మే 21 నిజం న్యూస్
ఏపీ మోడల్ స్కూల్ లో 2023 – 24 విద్యా సంవత్సరమునకు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో విద్యార్థుల ప్రవేశము కొరకై ఆన్ లైన్ ద్వారా ఎంపీసీ/బైపీసీ/ ఎంఈసీ/సీఈసీ గ్రూపులలో ఉచిత విద్య పొందగోరు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చునని ప్రిన్సిపాల్ రంగన్న ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఆదర్శ పాఠశాలలో బోధనామాధ్య మం ఆంగ్లంలో ఉండునని, ఈ పాఠశాలలో విద్యనభ్యసించుటకు ఎటువంటి ఫీజులు వసూలు చేయబడవని తెలిపారు.
ALSO READ: ఐపీఎల్ లో అత్యధిక సెంచరీల రికార్డు నెలకొల్పిన కింగ్ కోహ్లీ
ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 10వ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులు మాత్రమే దరఖాస్తు
చేసుకోవాలని,దరఖాస్తు చేయడానికి ముందుగా వివరాలతో కూడిన సమాచారము కొరకు https://apms. apcfss.in
https: //cse.ap.gov. in చూడాలని సూచించారు.
ఈ నెల 22. 05. 2023 నుండి 07. 06. 2023 వరకు netbanking / credit / debit card లను ఉపయోగించి gate way ద్వారా అప్లికేషన్ రుసుము చెలించిన తరువాత వారికి ఒక జనరల్ నెంబరు కేటాయించబడునని, ఆ జనరల్ నెంబరు ఆధారంగా వెబ్ సైట్ https://apms. apcfss. in https: //cse. ap. gov. in లో దరఖాస్తు చేసుకొనవాలన్నారు.
దరఖాస్తు చేయడానికి OC, BC మరియు EWS లకు రూ. 200, SC మరియు ST లకు రూ. 150 రుసుం చెల్లించాలని తెలిపారు. ప్రవేశములు 10వ తరగతి మార్కుల మెరిట్ ద్వారా రిజర్వేషన్ రూల్స్ ప్రకారం ఇవ్వబడునని ఇతర వివరములకు ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ ను సందర్శించాలన్నారు.