ఐపీఎల్ లో అత్యధిక సెంచరీల రికార్డు నెలకొల్పిన కింగ్ కోహ్లీ
గుజరాత్ టైటాన్స్ తో ఆదివారం బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 60 బంతులలో సెంచరీ సాధించాడు. ఈ సీజన్లో కోహ్లీకి ఇది వరుసగా రెండవ సెంచరీ. ఈ నెల 16న హైదరాబాద్ లో సన్రైజర్ తో జరిగిన మ్యాచ్ లో 62 బంతుల్లో కోహ్లీ సెంచరీ సాధించిన విషయం తెలిసింది.
కోహ్లీకి ఐపీఎల్లో ఇది 7వ సెంచరీ. నాలుగు సంవత్సరాల తర్వాత కోహ్లీ ఐపిఎల్ లో వరుసగా రెండు సెంచరీలు సాధించాడు.
2019లో కోల్ కత్తా లో సెంచరీ సాధించిన తర్వాత వరుసగా రెండు సెంచరీలను సాధించడం విశేషం.
ఐపీఎల్ లో అత్యధిక సెంచరీలు సాధించిన రికార్డును సాధించాడు. క్రిస్ గేల్ ఇప్పటివరకు 6 సెంచరీలను చేశాడు.
Also read: ఉసురు తీస్తున్న గోదావరి ఊబులు
ఈ మ్యాచ్ లో కోహ్లీ 101 తో నాటౌట్ గా ఉండి ఒంటరి పోరాటం చేశాడు
మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజ్ బెంగళూరు 20 ఓవర్లలో 195 పరుగులను చేసింది.
కోహ్లీ ఫామ్ లోకి రావడంతో రానున్న 20 20 వరల్డ్ కప్ లో భారత్ విజయ అవకాశాలు మెరుగ్గా ఉండే అవకాశం ఉందని క్రీడా విశేషకులు అభిప్రాయపడుతున్నారు.