Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఉసురు తీస్తున్న గోదావరి ఊబులు

*వేసవి సరదాల కోసం నదిలోకి దిగడం

*ఆపై ప్రాణాలు పోగొట్టుకోవడం

* జొన్నాడలో ఆదివారం ఇద్దరిని పొట్టన పెట్టుకున్న గోదావరి

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మే 21,(నిజం న్యూస్) బ్యూరో :: గోదారమ్మకు వరదలు వచ్చి ఉగ్రరూపం దాల్చితే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి.అయితే వరదలు వచ్చినప్పుడు అంతగా ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం జరగటం లేదు.

కాని అంతగా నీరు లేని సమయంలోనే ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోవడం విశేషం. వేసవిలో ఆటవిడుపుగా ఆహ్లాదకరంగా ఉండే గోదావరి ఒడికి వెళ్లడం సహజమే. అక్కడితో ఆగితే పర్వాలేదు. నీరు లేదు కదా.. ఎంతో లోతుండదని సరదాకి దిగితే దొంగ ఊబులకు చిక్కుకుని ప్రాణాలను పోగొట్టుకోవాల్సిందే.చూడటానికి అడుగు లోతులో ప్రవహించే నీరు మాత్రమే కనిపిస్తుంది.

కాని అందులో దిగితే దొంగ ఊబులకు చిక్కి ప్రాణాలు కోల్పోవాల్సిందే.ఈ ప్రమాదకరమైన ఊబిల గురించి ఆ ప్రాంతంలో ఉండే స్థానికులకు తప్ప బయట వారికి తెలియదు. అందుకనే ఎక్కువగా ప్రమాదాలకు ఇతర ప్రాంతాలకు చెందిన వారే గురవుతుంటారు.

అందుకునే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని ముందుగానే సంబంధిత పోలీసులు, స్థానికులు గుర్తించి ఆ ప్రాంతాలలో హెచ్చరిక బోర్డులను కూడా ఏర్పాటు చేస్తుంటారు.అయినా లెక్క చేయకుండా గోదావరిలో దిగి ప్రాణాలు కోల్పోతారు.

Also read: బీఎస్పీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కిషోర్ దిష్టిబొమ్మ దగ్ధం

ఆదివారం జొన్నాడలో ఇరువురు మృతి

తాజాగా ఆదివారం అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం జొన్నాడలో ఇద్దరు యువకులు ఆ విధంగానే ఈ గోదావరిలో దిగి ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ మండలంలో అత్యధికంగా ఇలాంటి ప్రమాదాలు బడుగువానిలంక వద్ద ప్రమాదాలు జరుగుతుంటాయి.

ఆ గ్రామానికి ఆనుకుని ఉండే సుమారు 6 కిలోమీటర్ల పరిధిలో అనేక పాయలు ఉంటాయి. ఆలమూరు మండలంతో పాటు కడియం, మండపేట ప్రాంతాల నుంచి వేసవికాలంలో ఈ గోదావరి సరదాలకు వస్తూ ఉంటారు. అనుకోకుండా ఈ దొంగ ఊబిలలో చిక్కుకొని ప్రాణాలు కోల్పోతారు.

అందుకనే ముందు జాగ్రత్తగా రెండు రోజులు క్రితమే పలు రేవులు వద్ద పోలీసులు హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసి అప్రమత్తం చేశారు. అయితే ఈసారి జొన్నాడలో ప్రమాదం జరగడం బాధాకరం.

కొత్తపేటకు చెందిన గెద్దాడ కరణ్ కుమార్(22),అయినవిల్లి మండలం పెద్దపాలెంకు చెందిన మోటూరి త్రిలోక్(18)లను గోదావరి ఊబులు ప్రాణాలు తీసాయి.ఆరుగురు యువకులు పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడానికి వచ్చారు.

అనంతరం ఆరుగురూ స్నానానికి దిగిగా అందులో ఇద్దరు మృతి చెందారు. మిగిలిన నలుగురు సురక్షితంగా బయట పడ్డారు. కేవలం ఈ గోదావరి ప్రవాహంపై వారికి ఎలాంటి అవగాహన లేక పోవడం వల్లే ఇటువంటి ప్రమాదాలు చోటు చేటుచేసుకుంటున్నాయి.

పైగా ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఇటీవలనే ఇసుక తవ్వకాలు జరిగాయి. ఆ విషయం తెలియక వారు ప్రమాదానికి గురై నట్లు తెలుస్తుంది.