బీఎస్పీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కిషోర్ దిష్టిబొమ్మ దగ్ధం
హైదరాబాద్ మే 21 నిజం న్యూస్
అడ్వకేట్ యుగేంధర్ పై శనివారం మధ్యాహ్నం బి ఆర్ఎస్ నాయకులు చేసిన దాడి పై ఆదివారం తిరుమలగిరి చౌరస్తా లో బిఎస్పీ తుంగతుర్తి నియోజకవర్గం అధ్యక్షులు చింతకుంట్ల చింతయ్య అధ్యక్షతన బిఎస్పీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు అనంతరం ఎమ్మెల్యే గాదరి కిశోర్ దిష్టిబొమ్మ దహనం చేశారు.
Also read: కార్పోరేట్ కళాశాలలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
ఈ సందర్భంగా రాష్ట్ర అధికార ప్రతినిధి కోంగరి అరుణ క్యిన్ మాట్లాడుతూ ఈ దాడికి పాల్పడిన వ్యక్తుల పై రౌడీ షిట్ ఓపెన్ చేసి పిడి యాక్ట్ పెట్టాలని డిమాండ్ చేశారు .
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శిలం అనితా రెడ్డి, రాష్ట్ర మహిళా కన్వీనర్ నర్రా నిర్మల, రాష్ట్ర కార్యదర్శి బోడ్డు కిరణ్, సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బుడిగే మల్లేష్ యాదవ్, సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షులు దాశరథ, కోదాడ నియోజకవర్గం ఇంచార్జి పిల్లుట్ల శ్రీనివాస్, నల్గొండ జిల్లా అధ్యక్షులు పూదురి సైదులు, తుంగతుర్తి నియోజకవర్గం ఇంచార్జి దందోలు తీరుపతయ్య , తుంగతుర్తి నియోజకవర్గం నాయకులు మరియు వివిధ జిల్లా & నియోజకవర్గంల బిఎస్పీ నాయకులు పాల్గొన్నారు