Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

కార్పోరేట్ కళాశాలలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

2023-24వ విద్యా సంవత్సరం లో కార్పొరేట్ కళాశాలల యందు ప్రవేశము పొందుటకు మార్చి 2023 లో పదవ తరగతిలో ఉతీర్ణులైన విద్యార్థినీ విద్యార్థులు
22.05.2023 నుండి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు జిల్లా షెడ్యుల్డ్
కులములు అభివృద్ధి అధికారి కె. దయానంద రాణి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. బి.సి., పి.హెచ్.సి. మరియు మైనారిటీ విద్యార్ధులు ఆన్లైన్ ద్వారా సంబంధిత ధ్రువ పత్రాలతో దరఖాస్తులు చేసుకోవాలని తెలియజేశారు.

Also read: సగానికి సగం పడిపోయిన నూనె ధరలు

ఈ అవకాశం మార్చి – 2023 లో పదవ తరగతిలో ఉతీర్ణులై జి.పి.ఏ. 7.0 ఆ పైన జి.పి.ఏ. సాదించిన విద్యార్థులు మాత్రమే అర్హులు.

కార్పోరేట్
కళాశాలల్లో ప్రవేశానికి ప్రభుత్వ షెడ్యుల్డ్ కులముల వసతి గృహముల యందు వసతి పొంది
ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించిన విద్యార్థిని విద్యార్థులు, మోడల్ స్కూల్, కేజీబీవీ,
ప్రభుత్వ, ఎయిడెడ్, మునిసిపల్, జిల్లా పరిషత్, ప్రభుత్వ రెసిడెన్షియల్, జవహర్ నవోదయ
విద్యాలయం, బెస్ట్ అవైలబుల్ పాఠశాలల యందు చదివిన విద్యార్థిని విద్యార్థులకు కార్పొరేట్
కళాశాల యందు ఉచితంగా ప్రవేశం కల్పించబడునని తెలిపారు.

 ఆసక్తి కలిగిన మార్చి
2023 లో పదవ తరగతిలో ఉతీర్ణులైన విద్యార్థినీ విద్యార్థులు https://telanganaepass.cgg.gov.in అన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
ముఖ్యమైన తేదీలు :-
1. దరఖాస్తులు ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ చేసుకొనుటకు తేదీ.22.05.2023 నుండి
తేదీ. 03.06.2023 వరకు.
2. సెలెక్షన్ లిస్టు తేదీ. 07.06.2023.
3. ఎంపికైన విద్యార్ధుల ధృవ పత్రముల పరిశీలన, కళాశాలల అలాట్మెంట్ ఆర్డర్స్ 09.06.2023 న పొందుట జరుగుతుందని తెలిపారు.