Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

సగానికి సగం పడిపోయిన నూనె ధరలు

నూనెల ధరలు దిగొచ్చాయ్

పచ్చళ్లు పట్టకపోవడమే కారణం

ఆయిల్‌ వ్యాపారుల ఆందోళన

సామాన్యుల ఆనందం

మహబూబాబాద్ బ్యూరో మే 21 నిజం న్యూస్

నూనెల ధరలు తగ్గుము ఖం పట్టాయి. కరోనా కష్టకాలంలో ఒక్కసారిగా కాక పుట్టించిన ధరలు ఇప్పుడిప్పుడే చల్లబడుతు న్నాయి. దాదాపు అన్ని రకాలు దిగివస్తున్నాయి.

సాధారణంగా వేసవికాలం పచ్చళ్ళ కాలం..ఈ సమయంలో ఆయిల్‌ ధరలు ఆకాశాన్నంటేవి.. అలాంటిది ఈ వేసవికాలం ఆయిల్‌ ధరలు భారీ గా పతనమయ్యాయి. గతంలో అయితే పచ్చళ్లు ఎక్కువగా పట్టేవారు. ప్రస్తుతం పచ్చళ్లు పట్టడమే మానేశారు.

ఒక వేళ ఎక్కడైనా పచ్చళ్లు పట్టినా ఆవకాయ మామిడి అయితే 20 నుంచి 30 కాయల మధ్యనే పడుతున్నారు. గతంలో అయితే 100 నుంచి 200 కాయల మధ్యన పట్టేవారు. కుమార్తెల అత్తవారింటికి పంపేవారు.

ప్రస్తుతం ఆ పద్ధతి లేదు. ఎందుకంటే పట్టినా పాడైపోతుం డడంతో అంతగా ఆసక్తి చూపడంలేదు. ఏదో ఒక పచ్చడి కొనుగోలు చేసుకుని మమ అనిపిస్తు న్నా రు. ఎందుకంటే పచ్చడిలో వాడే మామిడి కాయ, మిరపకాయలు, ఆవాలు, చింతపండు వంటి ధర లు పెరగడం కూడా ఒక కారణంగా ఉంది.

గతంలో ఉక్రెయిన్‌లో యుద్ధం కారణంగా ఆయిల్‌ దిగుమతులు నిలిచిపోయాయి. ఆ సమయంలో ఆయిల్‌ ధరలు ఆకాశన్నంటాయి. ఉక్రెయిన్‌ యుద్ధం ముందు వరకూ కిలో రూ.99 లు ఉండే ఫ్రీడం సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ ధర రూ.220 మార్కు దాటింది. ప్రస్తుతం ఉక్రెయిన్‌ నుంచి భారీగా ఆయిల్‌ భారతదేశానికి దిగువమతి కావడంతో మళ్లీ ధరలు దిగివస్తున్నాయి. ప్రస్తుతం ఫ్రీడం ఆయిల్‌ ధర కిలో రూ.120 నుంచి 130ల మధ్య విక్రయిస్తున్నారు.

ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టడం ఆయిల్‌ వస్తువులకు దూరంగా ఉండడం ఒక కారణమైతే వేసవిలో పచ్చళ్ళు పట్టే ఓపిక తగ్గడం ఎక్కడికక్కడ పచ్చళ్లు సైతం మార్కెట్‌లో అందుబా టులో ఉండడం కూడా నూనెల ధరల తగ్గుదలకు ప్రధాన కారణం గా ఉంది.

దీనికి తోడు ఉక్రెయిన్‌ దేశంలో యుద్ధవాతావరణం సమసిపో యి షిప్స్‌ కంటెనర్స్‌ ద్వారా సన్‌ఫ్లవర్‌ అయిల్స్‌ భారత దేశానికి భారీగా దిగుమతి అవ్వడంతో జిల్లాలో ఆయిల్‌ ధరలు గతంలో ఎప్పుడూ లేని విధంగా పతన మయ్యాయి.ఇదిలా ఉండగా మరోపక్క పప్పు నూనె ధరలు ఏ రోజుకారోజు ఆకాశానికి ఎగబాకు తున్నాయి.

ప్రతి ఇంట్లోను విరివిగా వినియోగించే రిఫండ్‌ ఆయిల్‌, సన్‌ఫ్ల వర్‌, వేరుశెనగ నూనెలు ధరలు భారీగా పతనమయ్యాయి. జిల్లాలో ఆయిల్‌ వ్యాపారాలు చేసే ప్రముఖ సంస్థలన్నీ నష్టాలబాట పట్టాయి.

పెరుగుతున్న పప్పునూనె ధరలు ప్రతిఒక్కరికి ఆరోగ్యంపై శ్రద్దపెరగిన కారణం గా సాధారణ నూనె వినియోగం బాగా తగ్గింది. దీనికి తోడు పప్పు నూనె వినియోగం పెరగడంతో పప్పు నూనె ధరలు ఆకాశాన్నం టుతున్నాయి.

Also read: పొడి చెత్తను కొనుగోలు చేస్తాం

గతేడాది లీటరు పప్పు నూనె సు మారు రూ. 360లు ఉండగా ఈ ఏడాది రూ.450లు పలుకు తోంది. 15 లీటర్ల డబ్బా రూ.6750. పప్పు నూనె వినియోగం ఆరోగ్యానికి మంచిది కావడంతో అందరి చూపు పప్పు నూనె పైనే ఉంది.దీంతో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.

15 లీటర్ల డబ్బా ఆయిల్‌ ధరలిలా..

సంవత్సరం రిఫండ్‌ సన్‌ ఫ్లవర్‌ వేరుశెనగ

2021 2700 3000 2600

2022 1900 2400 2300

2023 1460 1550 2000

2021వ సంవత్సరంలో 15 లీటర్ల డబ్బా రూ. 2700 ఉండగా ఈ ఏడాది రూ.1460లకు పడిపోయింది. సుమారు సగానికి సగం ధర పడిపోయింది. ఇక సన్‌ఫ్లవర్‌దీ అదే దారి..

2021లో రూ.3 వేలు ఉండగా ప్రస్తుతం రూ.1550ల ఽధర పలుకుతోంది. వేరుశనగ నూనె తగ్గుదల మాత్రం అంతంతమాత్రంగా ఉంది.
ఇలా తగ్గడం 48 ఏళ్లగా చూడలేదు..
నేను 48 ఏళ్లుగా ఆయిల్‌ వ్యాపారం చేస్తున్నా.. ఆయిల్‌ ధరలు ఇంత భారీగా పతనం కావడం ఈ ఏడాదే చూస్తున్నా. గతంలో ఎప్పుడూ ధరలు ఇలా పతనం కావడం చూడలేదు. ఆయిల్‌ వ్యా పారం చేసే సంస్థలన్నీ నష్టాలబాట పట్టాయి.