Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

పొడి చెత్తను కొనుగోలు చేస్తాం

పర్యావరణాన్ని సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత.

ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొడదాం… ప్రతి వార్డులో పొడి చెత్తను కొనుగోలు చేస్తాం… ప్రజలు సహకరించాలి

సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్*

సూర్యాపేట ప్రతినిధి మే 20 నిజం న్యూస్

సూర్యాపేట పట్టణంలోని 25వ వార్డులో శనివారం మున్సిపాలిటీ కౌన్సిల్ ఆఫ్ సూర్యాపేట వారు స్థానిక కౌన్సిలర్ శ్రీమతి ఆకుల కవిత లవకుశ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మేరీ లైఫ్ మేర స్వచ్ఛ సెహర్ కార్యక్రమానికి హాజరై పొడి చెత్త కొనుగోలు కార్యక్రమాన్ని ప్రారంభించిన సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్

ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ సూర్యాపేట పట్టణ ప్రజలందరూ పొడి చెత్త ను పారేయకుండా వారానికి ఒక్కసారి మేరీ లైఫ్ మేరా స్వచ్ఛ శేహార్ వారు ఏర్పాటుచేసిన పాయింట్ దగ్గరికి వెళ్లి మీ యొక్క పొడి చెత్తను మమ్మీ కేజీకి ఐదు రూపాయలు చొప్పున లబ్ది పొందగలరని ఆశిస్తున్నాను అని అన్నారు.

ALSO READ: వ్యవసాయంలో డ్రోన్ల వల్ల లాభాలు, ఖర్చు

దీనివలన మీకు డబ్బులు జమ చేసుకుంటారు అదేవిధంగా మేము రెడ్యూస్ రియూస్ రీసైక్లింగ్ చేసి మనకు ఉపయోగపడే విధంగా చేసుకోవడానికి ఆస్కారం ఉంది అని అన్నారు.

తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి అభివృద్ధిలో భాగంగా సూర్యాపేట పట్టణాన్ని చెత్త రహితంగా స్వచ్ఛ సూర్యాపేటగా తీర్చిదిద్దుకోవచ్చు అని అన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోగలరు అని అన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కమిషనర్ రామంజుల రెడ్డి, మాజీ ఫ్లోర్ లీడర్ ఆకుల లవకుశ, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు బైరు వెంకన్న ముదిరాజ్, సారిటరీ ఇన్స్పెక్టర్ సారగాండ్ల శ్రీనివాస్, కొనుగోలు సంస్థ సభ్యులు, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.