Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

వ్యవసాయంలో డ్రోన్ల వల్ల లాభాలు, ఖర్చు

వ్యవసాయంలో డ్రోన్ల వాడకం మరియు వానాకాలం లో సాగు చేసే వరి రకాలపై రైతులకు శిక్షణ
గరిడేపల్లి మే 20 (నిజాం న్యూస్)
మండల పరిధిలోని గడ్డిపల్లి కే వీ కే లో శనివారం నాడు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, రాజేంద్రనగర్ ఆధ్యర్యంలో డ్రోన్ల వాడకం మరియు వానాకాలం లో సాగుకు అనువైన వరి రకాల పై ఒక రోజు శిక్షణ కార్యక్రమానికి రాజేంద్రనగర్ ఏ ఆర్ ఐ డా|| పి రఘు రామి రెడ్డి, ప్రిన్సిపల్ సైంటిస్ట్ & హెడ్ (వరి), ముఖ్య అతిథిగా పాల్గొని రైతులను ఉద్దేశించి మాట్లాడారు.

వ్యవసాయములో డ్రోన్ల వాడకంలో తీసుకోవాల్సిన మెలకువలు, డ్రోన్ల రకాలు, ఎకరానికి వాడాల్సిన పురుగుమందులు/నీటిలో కరిగే ఎరువుల మోతాదును మరియు డ్రోన్ల పరిరక్షణ లేదా మన్నికకు పాటించాల్సిన జాగ్రత్తల గురించి తెలిపారు.

ఈ కార్యక్రమంలో కె.వి.కె సీనియర్ సైంటిస్ట్ అండ్ హెడ్ బి లవకుమార్ మాట్లాడుతూ కేవీకే లో జరిగే శిక్షణ కార్యక్రమాల గురించి, స్వయం ఉపాధిగా డ్రొన్ల పిచికారిని యువకులు నేర్చుకొని ఉపాధి పొందవచ్చని అన్నారు.

ఈ కార్యక్రమంలో డా|| టీ కిరణ్ బాబు శాస్త్రవేత్త (ప్లాంట్ పాథాలజీ) ఐ ఆర్ ఆర్, రాజేంద్రనగర్ మాట్లాడుతూ డ్రోన్ వాడకంలో అత్యుత్తమ ఫలితాలకు పాటించాల్సిన ఎత్తు, నాజిల్ రకాలు, డ్రోన్ల ఖరీదు, శిక్షణ, కొనుగోలుకై బుణాలు, పెట్టుబడి లభ్యత మొదలగు వివరాలు మరియు వ్యవసాయంలో డ్రోన్ల వాడకం వల్ల లాభాలు, ఖర్చు తదితర అంశాల గరించి రైతులకు వివరించారు.

ALSO READ: పర్యావరణ పరిరక్షణకు మనకు మనం మారాలి

డా|| యల్ కృష్ణ, ప్రిన్సిపల్ సైంటిస్ట్ (ప్లాంట్ బ్రీడర్), ఐ ఆర్ ఆర్, రాజేంద్రనగర్ నూతన వరి వంగడాలను మరియు ముందస్తు వరి సాగు పై రైతులతో చర్చా కార్యక్రమం జరగింది. తదుపరి డ్రోన్ వాడకం పై ప్రదర్శన ఏర్ర్పాటు చేసి రైతులకు స్వయంగా వివరించారు.

తదుపరి నల్గొండ కంప సాగర్ ఏ ఆర్ఎస్ హెడ్ సీనియర్ సైంటిస్ట్ డా|| యన్ లింగయ్య, వివిధ వరి రకా ల గురించి వివరించారు. అనంతరం సూర్యాపేట కి చెందిన కే చందు డ్రోన్ వినియోగించే విదనం గురించి ప్రాక్టికల్ గా డెమో చేసి చూపించారు.

ఈ సందర్భంగా తెలంగాణ విశ్వ విద్యాలయం రైస్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు విడుదల చేసిన వివిధ వరి రకాలను ప్రదర్శించి రైతులకు చూపించడం జరిగింది. ఈ శిక్షణలో రైతులు అడిగిన ప్రశ్నలకు శాస్త్రవేత్తలు సమాధానం ఇవ్వడం జరిగింది.

ఈ కార్య క్రమం లో డా|| యస్ శ్రీనివాస రావు, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ కేవీకే కంపసాగర్, గడ్డిపల్లి కేవీకే శాస్త్రవేత్తలు సిహెచ్. నరేశ్, ఏ కిరణ్, డి ఆదర్శ్, డా|| టీ మాధురి, యన్ సుగంధి, ఎఫ్ పి ఓ రైతులు, వివిధ గ్రామాలకు 70 మంది రైతులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.