ఇష్టానుసారంగా రసాయన ద్రవాలను వదులుతున్న పరిశ్రమ

ప్రజల బాధలను పట్టించుకోని పిసీబీ అధికారులు
రసాయన ద్రవము భూగర్భానికి వదలడంతో బయటకు వస్తుంది
గ్రాన్యూల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారిపై తగిన చర్యలు తీసుకోవాలి
పటాన్ చెరువు మే 20 (నిజం న్యూస్)
హైదరాబాదుకు దగ్గరలో ఉన్న బొంతపల్లి గ్రామంలో అనేక పరిశ్రమలు ఉన్నాయి.అక్కడి గ్రామస్తులు గడపాలంటే వారి ఆరోగ్యన్ని తాకట్టు పెట్టడం లాంటిది, చేసుకోవడానికి పంట పొలాలు ఉన్న అవి పూర్తిగా కాలుష్యంతో పండని పరిస్థితి ఏర్పడింది.
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం బొంతపల్లి గ్రామంలో గ్రాన్యూల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారు బరితెగించి గ్రామ ప్రజలు చెబుతున్న పట్టించుకోకుండా వారి ఇష్టానుసారంగా రసాయన ద్రవాలను వదులుతున్నారు.
గ్రాన్యూల్స్ ప్రైవేట్ కంపెనీ గేటు దగ్గర్లో, ఇటు మెయిన్ రోడ్డు పక్కన ఈటీపి ఉండడంతో అక్కడ రసాయన ద్రవం భూమిని చీల్చుకుంటూ బయటకు వస్తుంది,నిత్యం ప్రజలు ఆ దారి గుండా వెళ్ళవలసిన అవసరం ఉంది.
ALSO READ: స్టేడియం నిర్మిస్తే.. గెస్ట్ హౌస్ గా మార్చారు
ఎందుకిలా వస్తుందంటే దాదాపు ఆరు టాంకర్ల ద్రవమును బయటకు తీసుకెళ్లాల్సి ఉంటే కేవలం రెండు మూడు ట్యాంకర్లను బయటకు పంపుతూ మిగతా రసాయన ద్రవము భూమి లోపల కి పంపడంతో ఈ రసాయన ద్రవము భూగర్భ భాగాన్ని పిప్పి చేస్తుంది అందువలన రసాయన ద్రవము బయటకు రావడం జరుగుతుంది.
ఇలా భూగర్భ భాగాన్ని పిప్పి చేయడంతో ఆ స్థలంలో నుజ్జు నుజ్జుగా అయ్యి దిగబడాల్సి వస్తుంది,కంపెనీ యజమానులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన కబుర్లు చెబుతూ యధావిధిగా వారి పనులు చేస్తున్నారు, ఇప్పటికైనా పిసిబి అధికారులు పట్టించుకోని గ్రాన్యూల్స్ కంపెనీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు..