Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

స్టేడియం నిర్మిస్తే.. గెస్ట్ హౌస్ గా మార్చారు

విద్యార్థులకు శాపం.. అధికారులకు, దొంగలకు వరం

విద్యార్థుల కోసం స్టేడియం నిర్మిస్తే.. అధికారులకు గెస్ట్ హౌస్ గా మార్చారు

2.20 కోట్ల రూపాయలతో స్టేడియం మేము నిర్మిస్తే.. మీరు చేసిందేంటి

సెల్ఫీ ఛాలెంజ్ తో ప్రకాష్ రెడ్డిని నిలదీసిన మాజీ మంత్రి పరిటాల సునీత

పిల్లలను క్రీడలకు దూరం చేసిన ఘనత ప్రకాష్ రెడ్డిదే

రామగిరి మే 20 (నిజం న్యూస్)

శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండల కేంద్రంలో మేము సుమారు 2.20 కోట్ల రూపాయలతో విద్యార్థుల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ సహకారంతో, పరిటాల రవీంద్ర గ్రీన్ ఫీల్డ్ స్టేడియం, ఇండోర్ స్టేడియం, జిమ్, పెవిలియన్, కాంపౌండ్ నిర్మిస్తే.. వైసిపి ప్రభుత్వం దానిని నాశనం చేసిందని మాజీ మంత్రి పరిటాల సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు.

గ్రీన్ ఫీల్డ్ స్టేడియం నుంచి ఆమె సెల్ఫీ ఛాలెంజ్ ద్వారా ఎమ్మెల్యేకు ప్రశ్నల వర్షం కురిపించారు. రామగిరి ప్రాంతంలో విద్యార్థుల కోసం ఎలాంటి క్రీడా మైదానాలు లేని పరిస్థితుల్లో ఎంతోమంది ఇబ్బంది పడేవారు. క్రీడల్లో రాణించే వారు ఉన్నా అందుకు తగిన విధంగా సదుపాయాలు లేకుండా పోయాయి. దీనిని గమనించిన మాజీ మంత్రి పరిటాల సునీత అప్పట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ సహకారంతో సుమారు 2.20కోట్ల రూపాయలతో రామగిరిలో పరిటాల రవీంద్ర గ్రీన్ ఫీల్డ్ స్టేడియంను నిర్మించారు.

ఇక్కడ సువిశాలమైన క్రీడా మైదానం అలాగే ఇండోర్ స్టేడియం, జిమ్ విద్యార్థులకు సేద తీరడానికి వసతి గదులు నిర్మించారు. ఇండోర్ స్టేడియంలో షటిల్, బ్యాడ్మింటన్, బాస్కెట్ బాల్ వంటి వాటికోసం అన్ని సదుపాయాలు కల్పించారు అలాగే లక్షలాది రూపాయలు వెచ్చించి జిమ్ పరికరాలు కూడా కొనుగోలు చేశారు.

తెదేపా ప్రభుత్వం హయాంలో అప్పటి కార్మిక క్రీడల శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఈ స్టేడియంను ప్రారంభించారు. ప్రభుత్వంతో పట్టు పట్టి ఈ ప్రాంతానికి అప్పటి మంత్రి పరిటాల సునీత స్టేడియం ను తీసుకొచ్చారని అచ్చెన్నాయుడు అన్నారు.

ALSO READ: పర్యావరణ పరిరక్షణకు మనకు మనం మారాలి

ప్రారంభ సమయంలో ఇక్కడ ఎంతో మంది క్రీడాకారులు శిక్షణ పొందుతూ ఆటలు ఆడేవారు. జిమ్ కూడా బాగా ఉపయోగపడేది. అయితే వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది పూర్తిగా నిరుపయోగంగా మార్చేశారు.

జిమ్ పరికరాల్లో కొన్నింటిని దొంగలు ఎత్తుకెళ్లారు. మరికొన్ని నిరుపయోగంగా మారిపోయాయి. అలాగే ఇండోర్ స్టేడియం ఎందుకు పనికిరాకుండా పోయింది. ఇక్కడ పిల్లలు ఆటలు ఆడేందుకు వీలులేదని తరచూ అడ్డు చెబుతున్నారు. మరోవైపు క్రీడాకారుల కోసం నిర్మించిన గదులను ప్రభుత్వాధికారులకు అప్పనంగా ఇచ్చేశారు.

ఇక్కడ ప్రస్తుతం ముగ్గురు అధికారులు దర్జాగా నివాసం ఉంటున్నారు. కెనరా బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్ జ్యోతి రెడ్డి, సచివాలయంలో వెటర్నరీ విభాగానికి చెందిన మమత, కస్తూరిబా పిఈటిగా ఉన్న సుమతి ఇక్కడ అనధికారికంగా నివాసం ఉంటున్నారు.

మరో బాధాకరమైన విషయం ఏంటంటే ఇక్కడ ఎవరైనా పిల్లలు ఆటలాడేటప్పుడు బాల్ వీరుంటున్న గదుల వైపుకు వస్తే మీరు ఇక్కడ ఆడేందుకు వీళ్ళలేదని మందలించి పంపేస్తాయికి వెళ్ళింది.

అసలు ఈ స్టేడియం ఎవరికోసం నిర్మించారు దాని ఉద్దేశం ఏంటి అనే విషయాలను పూర్తిగా విస్మరించారు. కోట్ల రూపాయలు వెచ్చించి స్టేడియం నిర్మిస్తే ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి దీనిని పూర్తిగా నిరుపయోగంగా మార్చేసారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ స్టేడియం క్రీడాకారులకు శాపంగానూ దొంగలకు, అధికారులకు వరంగా మారిపోయినట్టు ఉందని విమర్శించారు.